Varun Tej: ఆ కారణంగా పెళ్లి డేట్ మార్చుకున్న వరుణ్ తేజ్.. అసలు రీజన్ ఏంటంటే..
ప్రస్తుతం 'ఆపరేషన్ వాలెంటైన్' సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తుండగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తుండగా.. అదే స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్.

మెగా హీరోగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. కంచె, ముకుంద, ఫిదా, గద్దలకొండ గణేష్ వంటి చిత్రాలతో హిట్స్ అయ్యాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ సినిమాతో అడియన్స్ ముందుకు రానున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయిన ఈ మూవీ మార్చి 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇందులో మానుషి చిల్లర్ కథానాయికగా నటిస్తుండగా.. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, ట్రైలర్, టీజర్, సాంగ్స్ మూవీపై మరింత క్యూరియాసిటిని కలిగించాయి. ఇక ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తుండగా.. అదే స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మేకర్స్. హైదరాబాద్ లో జరిగిన ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చి సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి. కొన్ని రోజులుగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న వరుణ్ సినిమా గురించి.. పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో తన పెళ్లి నవంబర్ లో జరగడానికి గల కారణాలను వెల్లడించారు.
ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు వరుణ్. ఈ మూవీ కోసం రెండు నెలలు ప్రత్యేకంగా హిందీ భాష కోసం శిక్షణ తీసుకున్నానని..ఈ సినిమాలో తన పాత్రకు సొంతగా డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. కానీ యాస అంత సరిగ్గా కుదరకపోవడంతో ప్రత్యామ్నాయంగా మరొకరితో డబ్బింగ్ చెప్పించారని అన్నారు. ఇందులో ఫైటర్ పైలట్ పాత్రలో కనిపించనున్నారు వరుణ్. ఈ సందర్భంగా తన రోల్ గురించి మాట్లాడుతూ.. “చాలా మంది ఎయిర్ ఫోర్స్ అధికారులను కలిశాను. ఎయిర్ బేస్ కు వెళ్ళి షూటింగ్ చేశాం. బ్రేక్ దొరికితే అధికారులతో మాట్లాడేవాణ్ని. తెలుగువాళ్లు చాలా మంది ఉన్నారు. వాళ్ల ఆపరేషన్స్ గురించి వింటూ స్పూర్తి పొందేవాడిని. ఫైటర్ జెట్.. గురించి షూటింగ్ సమయంలో తెలుసుకున్నాను.
ఫైటర్ జెట్ లో దాదాపు 40 రోజులు షూటింగ్ చేశాం. ఆ సమయంలో భారతీయ వైమానిక దళంలో ఉన్నట్లు అనిపించింది. ఫోన్స్ లేకుండా చిత్రీకరణలో పాల్గొనడం కూడా చాలా బాగుండేది. పనిపైనే ధ్యాస పెడుతూ చిత్రీకరణని చాలా ఆస్వాదించాం. ఈ సినిమా కోసం నా పెళ్లి ముహూర్తాన్నీ మార్చుకుని.. మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.