Sidhu Moosewala: సింగర్ సిద్ధూ మూసేవాలా పేరెంట్స్ షాకింగ్ నిర్ణయం.. 58 ఏళ్ల వయసులో రెండవ బిడ్డ ?..
చిన్న వయసులోనే దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. 2022 మేలో జరిగిన సింగర్ దారుణహత్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో సిద్ధూ మరణానంతరం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కూడా హత్య చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఆగంతకులు. సిద్ధూ తల్లిదండ్రులకు అతడు ఏకైక సంతాపం. ఒక్కాగానొక్క కొడుకు మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సిద్ధూ అకాల మరణంతో యావత్ పంజాబ్ రాష్ట్రం ఉలిక్కిపడింది.

పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలాకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి తెలిసిందే. అతడి మ్యూజిక్, పాటలకు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. కానీ చిన్న వయసులోనే దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. 2022 మేలో జరిగిన సింగర్ దారుణహత్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అప్పట్లో సిద్ధూ మరణానంతరం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ను కూడా హత్య చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు ఆగంతకులు. సిద్ధూ తల్లిదండ్రులకు అతడు ఏకైక సంతాపం. ఒక్కాగానొక్క కొడుకు మృతి చెందడంతో అతడి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సిద్ధూ అకాల మరణంతో యావత్ పంజాబ్ రాష్ట్రం ఉలిక్కిపడింది. అందరూ చూస్తుండగానే సిద్ధూ మూసేవాలాను దుండగులు తుపాకీలతో కాల్చి చంపడంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఇప్పుడు సిద్ధూ పేరెంట్స్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో రెండో బిడ్డను ప్రసవించేందుకు సిద్ధమయ్యింది.
ఇండియన్ ఎక్స్ ప్రెస్ లోని నివేదిక ప్రకారం సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ మార్చిలో తమ రెండో బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతించనున్నట్లు తెలుస్తోంది. ఐవీఎఫ్ ద్వారా మరో గర్భం దాల్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నట్లు సమాచారం. సిద్ధూ తల్లి వయసు ఇప్పుడు 58 సంవత్సరాలు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చడంతో ఆమెకు మరింత జాగ్రత్తగా చూసుకుంటున్నారు వైధ్యులు. వచ్చే నెలలో ఆమె రెండో బిడ్డను ప్రసవించనుందని సమాచారం.
2022లో మాన్సా నుంచి కాంగ్రెస్ సభ్యునిగా పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి ఓడిపోయాడు సిద్ధూ మూసేవాలా. అదే ఏడాది మే 29న మాన్సా జిల్లాలోని జవహర్కే గ్రామంలో తన స్నేహితులతో కలిసి కారులో వెళ్తుండగా.. కొందరు ఆగంతుకులు అతడిని కాల్చీ చంపినట్లు అధికారులు పేర్కొన్నారు. 2017లో సిద్ధూ మూసేవాలా ‘జి వ్యాగన్’పాటతో సంగీతం ప్రపంచంలోకి అడుగుపెట్టారు. అతడు పాడిన ఎన్నో పాటలకు మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. లెజండ్, సో హై, ది లాస్ట్ రైడ్ ఆల్బమ్స్ కు ప్రశంసుల అందుకున్నాడు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.