Kalki 2898 AD: భూత., వర్తమాన., భవిష్యత్‌ కాలమే ఈ సినిమా.! కల్కిపై నాగ్ అశ్విన్.

వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమా ‘కల్కి 2898 AD’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Kalki 2898 AD: భూత., వర్తమాన., భవిష్యత్‌ కాలమే ఈ సినిమా.! కల్కిపై నాగ్ అశ్విన్.

|

Updated on: Feb 28, 2024 | 10:10 AM

వరల్డ్ వైడ్ మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోన్న సినిమా ‘కల్కి 2898 AD’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో ఈ మూవీపై అంచనాలు తారస్థాయికి చేరాయి. వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో ప్రభాస్ కల్కి అవతారంలో కనిపించనున్నాడని ముందు నుంచి ప్రచారం నడుస్తోంది. అలాగే ఈ చిత్రానికి మహాభారతానికి సంబంధం ఉంటుందని రూమర్స్ వైరలయ్యాయి. తాజాగా ఈ సినిమాపై వస్తోన్న రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ్ అశ్విన్ చేసిన కామెంట్స్ ఈ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. గుర్గావ్‌లో జరిగిన సినాప్స్ 2024 ఈవెంట్‌లో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ మూవీ మహాభారతంతో ప్రారంభమవుతుందని వెల్లడించారు. “ఈ చిత్రం మహాభారతంతో ప్రారంభమై 2898లో ముగుస్తుంది. మొత్తం 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుంది. ఇన్ని సంవత్సరాల మధ్య ప్రపంచాలను సృష్టించడానికి ప్రయత్నించాము. ఇందులోని పాత్రలన్నీ ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయి. భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుందో చూపే ప్రయత్నం కూడా చేశాం. అందుకే ఓ ఊహా ప్రంపచాన్ని క్రియేట్ చేశాం. అందుకే ఈ సినిమాకు కల్కి 2898 అని టైటిల్ పెట్టాం. క్రీ.శ. 3102 క్రీ.శ. 2898కి 6000 సంవత్సరాల వెనుక ఈ చిత్రం ప్రారంభమవుతుంది, ఆ సమయంలో కృష్ణుడి చివరి అవతారం గడిచిపోయిందని నమ్ముతారు. ఈ సినిమా చాలా సెట్లు, డిజైన్స్, వాహనాలను కొత్తగా నిర్మించాల్సి వచ్చింది. అలాగే ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ కోసం వెళ్లాల్సిన అవసరం లేదు అనిపించింది. ఈ మూవీ పూర్తి కావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుంది” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Follow us
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
పాన్ ఇండియా సినిమా షూటింగులతో బిజీబిజీగా రష్మిక.. ఫొటోస్
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
లేడీ ట్రాఫిక్‌ పోలీసులకు పట్టుబడ్డ బుడ్డొడి యాక్టింగ్ వెరే లెవల్!
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
విశాఖనే ఆంధ్రప్రదేశ్ రాజధాని.. మేనిఫెస్టోలో వెల్లడించిన సీఎం జగన్
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
వేసవి కాలం కళ్ళు మంటలా.. ఇలా చేస్తే చిటికెలో ఉపశమనం పొందవచ్చు..
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
అంపైర్లపై హార్దిక్ తీవ్ర ఆగ్రహం.. అసలేం జరిగిందంటే? వీడియో
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
నల్ల ఎండు ద్రాక్షతో నమ్మలేని ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే ఇకవదలరు
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
ఫ్లైట్‌లో ఎయిర్‌ హోస్టస్‌కు ప్రపోజ్ చేసిన పైలట్..! ఆ తర్వాత జరిగి
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
సినిమా ఇండస్ట్రీలో ఆ ఇద్దరినే అన్నయ్యా అని పిలుస్తాను: నటి జయసుధ
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
మీ కుటుంబలో ఎవరికైనా గుండె జబ్బు వచ్చిందా ??
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్
టమాటా జ్యూస్ ని డైలీ తాగితే.. ఆ సమస్యలకు చెక్