AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Upasana: ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్‌డే ఎలా? ఉపాసన సంచలన పోస్ట్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా, రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

Upasana: ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్‌డే ఎలా? ఉపాసన సంచలన పోస్ట్
Upasana
Basha Shek
|

Updated on: Aug 15, 2024 | 4:28 PM

Share

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ కోడలిగా, రామ్ చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఉపాసన. అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తూనే పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఇక గతేడాది అమ్మగా ప్రమోషన్ పొందిన ఉపాసన ఇప్పుడు తన కూతురు క్లింకార కొణిదెల ఆలనాపాలనలో బిజీగా ఉంటోంది. కాగా గురువారం దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ ఒకరికొకరు శుభాకాంక్షలు, అభినందనలు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అయితే స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మెగా కోడలు షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది. కోల్‌కతాలో వైద్యవిద్యార్థిపై జరిగిన ఘటన చూస్తుంటే మానవత్వం ఎక్కడుందంటూ ఉపాసన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతుంటే ఇండిపెండెన్స్ డే ఎలా జరపుకోవాలి? అని ప్రశ్నించింది.

‘సమాజంలో మానవత్వం లేకపోవడం చూస్తుంటే అసహ్యంగా ఉంది. మహిళా వైద్యురాలిపై ఇలాంటి ఘోరం జరగడం బాధాకరం. దీన్ని ఎవరూ సహించరు. జీవితానికి గౌరవం ఎక్కడుంది?. మన సమాజంలో అనాగరికత ఇంకా కొనసాగుతుంటే స్వాతంత్ర్యం జరుపుకోవాలా? ఆ అమ్మాయిపై అలా రాక్షసంగా ప్రవర్తించిన వాడు నా దృష్టిలో అసలు మనిషే కాదు. మన దేశంలో ఆరోగ్య సంరక్షణలో మహిళలు కీలక పాత్ర పోషిస్తారు. శ్రామిక శక్తిలో 50 శాతానికి పైగా వారే ఉన్నారు. ఎక్కువ మంది మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావడమే నా జీవిత లక్ష్యంగా చేసుకున్నాను. ఈ కోల్‌కతా ఘటన నా సంకల్పాన్ని మరింత బలపరిచింది. ప్రతి మహిళకు భద్రత, గౌరవం అవసరం. మనమంతా కలిసి ఉంటే సమాజంలో మార్పు తీసుకురావచ్చు’ అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది ఉపాసన.

ఇవి కూడా చదవండి

ఉపాసన పోస్ట్ ఇదిగో..

ప్రస్తుతం ఉపాసన షేర్ చేసిన పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. కోల్ కతా హత్యాచార ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్