Tunisha Sharma: ఇండస్ట్రీలో మరో విషాదం.. సెట్‏లోనే ఉరివేసుకొని సీరియల్ హీరోయిన్ ఆత్మహత్య..

20 ఏళ్ల తునీష్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. తునీషా భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్‌తో తన టీవీ అరంగేట్రం చేసింది. తునీషాను చూసిన సెట్‌లో ఉన్న వ్యక్తులు

Tunisha Sharma: ఇండస్ట్రీలో మరో విషాదం.. సెట్‏లోనే ఉరివేసుకొని సీరియల్ హీరోయిన్ ఆత్మహత్య..
Tunisha Sharma
Follow us

|

Updated on: Dec 24, 2022 | 7:14 PM

టెలివిజన్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. అలీ బాబా.. దస్తాన్ ఈ కాబుల్ సీరియల్ హీరోయిన్ తునీష శర్మ ఆత్మహత్యతో బుల్లితెర ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆమె నటిస్తోన్న సీరియల్ సెట్ లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. 20 ఏళ్ల తునీష్ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించింది. తునీషా భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్‌తో తన టీవీ అరంగేట్రం చేసింది. తునీషాను చూసిన సెట్‌లో ఉన్న వ్యక్తులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ప్రయత్నించారు. కానీ ఆమె మార్గమధ్యంలో మరణించింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం భివాండి (థానే) ఆసుపత్రికి తరలించారు. తునీషా మరణంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి.

ప్రస్తుతం, తునీషా సోనీ SAB టీవీ సీరియల్ అలీ బాబా: దస్తాన్-ఎ-కాబుల్‌లో యువరాణి మరియమ్ పాత్రను పోషిస్తోంది. తునీషా ఫితూర్, బార్ బార్ దేఖో, కహానీ 2: దుర్గా రాణి సింగ్, దబాంగ్ 3 వంటి చిత్రాలలో కూడా నటించింది.. తునీషా ఫితూర్, బార్ బార్ దేఖోలో కత్రినా కైఫ్ యుక్తవయసులో ఉండే పాత్రను పోషించింది. కలర్స్ టీవీలో ఆమె నటించిన ‘ఇంటర్నెట్ వాలా లవ్’ సీరియల్ తో ప్రేక్షకులకు దగ్గరయ్యింది.

ఇవి కూడా చదవండి

తునీషా శర్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఎప్పుడూ హ్యాపీగా ఉంటూ సెట్‌లో అందరితో సరదాగా మాట్లాడే ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అంతా షాకయ్యారు. కొంతకాలం క్రితం టీవీ నటి వైశాలి ఠక్కర్ కూడా ఇలాగే ఆత్మహత్య చేసుకుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..