Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. సలార్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు..

కేజీఎఫ్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సలార్ సినిమాపై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది.

Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‏కు గుడ్ న్యూస్ చెప్పిన మేకర్స్.. సలార్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చేశారు..
Salaar
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2022 | 3:01 PM

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన రెండు చిత్రాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. సాహో, రాధేశ్యామ్ సినిమాల రిజల్ట్ తో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. ఇప్పుడు వారి ఆశలన్నీ సలార్ సినిమా పైనే ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాతో సెన్సెషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ సలార్ సినిమాపై ఇప్పటికే భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. చాలా కాలం తర్వాత డార్లింగ్ ఇందులో ఫుల్ మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన డార్లింగ్ వర్కింగ్ స్టిల్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. యావత్ దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు ఈ చిత్రనిర్మాతలు.

హోంబలే ఫిల్మ్ బ్యానర్ నిర్మాత అయిన విజయ్ కిరంగదూర్ సలార్ సినిమాపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ముందుగా ప్రకటించిన తేదీకే అంటే వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారట. అలాగే ఈ సినిమా డెఫినెట్ గా తమ నుంచి వచ్చిన అన్ని సినిమాల రికార్డ్స్ బ్రేక్ చేసే లెవల్లో ఉంటుందని చెప్పారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతుంది.

ఇవి కూడా చదవండి

మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో ప్రభాస్ సరసన శ్రుతి హాసన్ నటిస్తుండగా.. కీలకపాత్రలలో మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించనున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ 2 సృష్టించిన రికార్డ్ ను సలార్ బద్దలుకొట్టనున్నట్లు తెలుస్తోంది.