- Telugu News Photo Gallery Cinema photos Do you know that singer Sunitha gave voice to these heroines in Telugu telugu cinema news
Singer Sunitha: గాయని మాత్రమే కాదు.. డబ్బింగ్ ఆర్టీస్ట్గానూ మెప్పించిన సింగర్ సునీత.. తెలుగులో ఏఏ హీరోయిన్లకు తన వాయిస్ ఇచ్చారో తెలుసా..
సింగర్ సునీత.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా అరంగేట్రం చేసి ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. అంతేకాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ.. అనేక మంది కథానాయికలకు గాత్రదానం చేసింది. దాదాపు 500 సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ గా పనిచేసింది. సునీత్ వాయిస్ ఇచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందామా.
Updated on: Dec 23, 2022 | 9:52 PM

సింగర్ సునీత.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. 15 ఏళ్ల వయసులోనే గాయనిగా అరంగేట్రం చేసి ఎన్నో చిత్రాల్లో సూపర్ హిట్స్ సాంగ్స్ ఆలపించారు. అంతేకాదు.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణిస్తూ.. అనేక మంది కథానాయికలకు గాత్రదానం చేసింది. దాదాపు 500 సినిమాకు డబ్బింగ్ ఆర్టిస్ గా పనిచేసింది. సునీత్ వాయిస్ ఇచ్చిన హీరోయిన్స్ ఎవరో తెలుసుకుందామా.

మెగాస్టార్ చిరంజీవి.. జ్యోతిక జంటగా నటించిన సినిమా ఠాగూర్. ఇందులో హీరోయిన్ జ్యోతికకు తన గాత్రదానం చేసింది.

అలాగే మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య నటించిన చూడాలని ఉంది సినిమాలో సౌందర్య కు తన వాయిస్ అందించింది.

దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన మనసంతా నువ్వే తనూరాయ్ కోసం సింగర్ సునీత తన గాత్రం అందించింది.

మెగాస్టార్ చిరంజీవి.. సోనాలి బింద్రే... ఆర్తీ అగర్వాల్ నటించిన ఇంద్ర మూవీలో సోనాలి బింద్రేకు సునీత డబ్బింగ్ చెప్పారు.

రాజా, కమలినీ ముఖర్జీ నటించిన సినిమా ఆనంద్. ఇందులో కమలినీ ముఖర్జీకు.. గోదావరి మూవీలో కమలినీకి సునీత వాయిస్ అందించింది.

అక్కినేని నాగార్జున, స్నేహ నటించిన శ్రీరామదాసు సినిమాలో స్నేహకు వాయిస్ ఇచ్చారు సునీత .

ఇక శ్రీరామరాజ్యం చిత్రంలో నయనతార కోసం సునీత వాయిస్ అందించారు.

అలాగే.. తమన్నా, హన్సిక, నయనతార, శ్రియ, ఆర్తి చాబ్రియాకు సునీత వాయిస్ అందించారు.