Kaikala Sathyanaraya: కైకాల సత్యనారాయణకు.. కేజీఎఫ్ చిత్రానికి ఉన్న సంబంధమేంటో తెలుసా ?..

ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి కైకాల సత్యనారాయణకు ఓ సంబంధం ఉంది.

Kaikala Sathyanaraya: కైకాల సత్యనారాయణకు.. కేజీఎఫ్ చిత్రానికి ఉన్న సంబంధమేంటో తెలుసా ?..
Kaikala, Kgf Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2022 | 9:13 PM

టాలీవుడ్ సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. శనివారం ఆయన అంత్రక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. తెలుగు చిత్రపరిశ్రమలో సహయ నటుడిగా..ప్రతినాయకుడిగా, తండ్రిగా, తాతయ్యగా ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. గత 60 ఏళ్ల సినీ ప్రస్థానంలో దాదాపు 777కు పైగా చిత్రాల్లో నటించారు కైకాల. ఆయన పాత్రలకు గుర్తుగా నవరస నటనా సార్వభౌమ అనే బిరుదును కూడా సంపాదించుకున్నారు. కైకాల మృతితో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కైకాల.. ఆయన కుటుంబానికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ క్రియేట్ చేసిన కేజీఎఫ్ చిత్రానికి కైకాల సత్యనారాయణకు ఓ సంబంధం ఉంది.

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాకింగ్ స్టార్ యశ్ నటించిన చిత్రం కేజీఎఫ్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీగా వసూళ్లు రాబట్టి రికార్డ్ కెక్కింది. ఈ చిత్రాన్ని సాయి కొర్రపాటి, హోంబలే మేకర్స్ విజయ్ కిరంగదూర్ లతోపాటు.. కైకాల సత్యనారాయణ కుమారుడు కలిసి నిర్మించారు.

కన్నడలో ఈ చిత్రానికి సహ నిర్మాతగా పనిచేశారు. ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన తెలుగు హక్కులను తీసుకొని టాలీవుడ్ లో విడుదల చేసారు. ఆ సినిమా సమయంలో కైకాల సమత్యనారాయణకు కేజీఎఫ్ చిత్రయూనిట్ సన్మానం కూడా జరిపారు. ఇక కేజీఎఫ్ 2 చిత్రానికి సహా నిర్మాతగా పనిచేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.