Ram Charan: రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో రామ్ చరణ్.. ప్లెక్సీ అదిరిపోయింది..
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమా ఇప్పుడు ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్నికలలో ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఇప్పటికే చెర్రీ ప్రసంగించబోయే సభకు ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. అంతేకాదు.. అచ్చం రాజకీయ నాయకుడిగా లుక్ వచ్చేట్టు చెర్రీకి సంబంధించి భారీ కటౌట్స్ కూడా రాజమండ్రి గోదావరి నది ఒడ్డున దర్శనమిస్తున్నాయి. ఏంటీ షాకయ్యారా ?.. వరుస సినిమాలతో బిజీగా ఉన్న చరణ్.. ఎన్నికల ప్రచారంలోకి రావడమేంటీ ?.. ఏ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నాడు ? అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయా ? అయితే ఒక్క నిమిషం ఆగండి. చరణ్ నిజంగానే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నాడు. కానీ నిజ జీవితంలో మాత్రం కాదు. రీల్ లైఫ్ లో. అదేలాగా అనుకుంటున్నారా ? అదే.. డైరెక్టర్ శంకర్ మ్యాజిక్. ఇక అసలు విషయంలోకి వస్తే.. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈసినిమా ఇప్పుడు ఆర్సీ 15 వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటుంది.
ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుండగా.. హీరోయిన్ అంజలి కీలకపాత్రలో కనిపించనుంది. ఈ మూవీని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం పొలిటికల్ నేపథ్యంలో రాబోతుందని.. ఇందులో చరణ్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని ముందు నుంచి టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాలో చెర్రీ ముఖ్యమంత్రిగా కూడా కనిపించనున్నారని సమాచారం. పాన్ ఇండియా లెవల్లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు లీక్స్ బెడద తప్పడం లేదు. ఇప్పటికే చెర్రీ లుక్.. షూటింగ్ సెట్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలయ్యాయి. తాజాగా చెర్రీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతుంది.
గత కొద్ది రోజులుగా ఇండియన్ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్న శంకర్.. ఇటీవలే ఆర్సీ 15 షూటింగ్ తిరిగి ప్రారంభించాడు. రాజమండ్రిలో ఈ మూవీ చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. రాజమండ్రిలోని గోదావరి ఒడ్డున ఇసుక తిన్నెలపై ఓ భారీ పబ్లిక్ మీటింగ్ కు సంబంధించిన సెట్ నిర్మించారు. చుట్టూ కర్రలతో ఫెన్షింగ్ ని ఏర్పాటు చేయడమే కాుకండా దాని చుట్టూ భారీ కటౌట్స్ ఏర్పాటు చేశారు. చెర్రీతోపాటు.. శ్రీకాంత్, పలువురు కీలక నటీనటులు షూటింగ్ లో పాల్గొనగా దర్శకుడు శంకర్ ప్లాష్ బ్యాక్ కు సంబంధించిన కీలక ఘట్టాలను చిత్రీకరించబోతున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట లీక్ అయ్యాయి. అందులో చరణ్ పంచెకట్టు.. మెడలో కండువాతో అచ్చం రాజకీయ నాయకుడిగా కనిపిస్తున్న లుక్ అదిరిపోయింది. చరణ్ సినిమా షూటింగ్ అని తెలియడంతో భారీగా తరలివచ్చిన ఫ్యాన్స్ చరణ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఇక మరోవైపు మరోసారి చరణ్ లుక్ లీక్ కావడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.