NBK – Pawan kalyan: మిలియన్ డాలర్ పిక్.. బాలయ్యను కలిసిన పవన్.. నెట్టింట్ వైరల్

ప్రజంట్ ఈ పిక్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంది. మెగా, నందమూరి అభిమానులు ఈ ఫోటోపై మురిసిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.

NBK - Pawan kalyan: మిలియన్ డాలర్ పిక్.. బాలయ్యను కలిసిన పవన్.. నెట్టింట్ వైరల్
Pawan Kalyan Meets Balakrishna
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2022 | 8:26 PM

ఆహా అన్‌స్టాపబుల్ సీజన్ 2కు పవన్ కల్యాణ్ రాబోతున్నట్లు ఇప్పటికే కన్ఫామ్ అయ్యింది. దీంతో అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్  పండగ చేసుకుంటున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలు ఏం మాట్లాడుకుంటారు.. బాలయ్య పవన్‌ను ఆటపట్టిస్తారా..? ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఈ నెల ఎండింగ్‌లో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనుంది. వేయి కళ్లతో ఈ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు.  అయితే తాజాగా అందుకు శాంపిల్ అన్నట్లు ఓ పిక్ తెగ వైరల్ అవుతుంది. వీరసింహారెడ్డి సెట్స్‌లో బాలయ్యను కలిశారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. బాలయ్య, పవన్ పక్కపక్కన నిల్చుని.. ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. దర్శకుడు క్రిష్, హీరోయిన్ శృతి హాసన్, మైత్రి ప్రొడ్యూసర్ రవి, మరో ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం కూడా ఈ ఫోటోలో ఉన్నారు.

గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో వస్తున్న వీరసింహా రెడ్డి మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది. ఆ తర్వాత రోజే మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు సినిమాల్లోనే శృతి హాసనే హీరోయిన్. రెండు చిత్రాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు అనే మూవీ చేస్తున్నాడు. పిరియడ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొన్న పవన్.. ఆ తర్వాత వీరసింహా రెడ్డి సెట్స్‌లోకి వెళ్లి బాలయ్యను కలిశారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.