Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. ‘ఒక్కడు’ 4k వెర్షన్ ట్రైలర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..

మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది ఒక్కడు సినిమా. అలాగే మణిశర్మ అందించిన సంగీతం సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో మహేష్, ప్రకాష్ రాజ్ నటనకు సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. తాజాగా ఫ్యాన్స్ ముందుకు ఈ చిత్రాన్ని 4కే థియేటర్ రిలీజ్ చేస్తున్నారు

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. 'ఒక్కడు' 4k వెర్షన్ ట్రైలర్ వచ్చేస్తుంది.. రిలీజ్ ఎప్పుడంటే..
Okkadu
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2022 | 5:23 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‏ను మలుపుతిప్పిన సినిమా ఒక్కడు. ఆయన ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా 2003లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో భూమిక కథానాయికగా నటించగా… ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ కనిపించారు. తెలుగులోనే కాకుండా.. తమిళం, కన్నడ, హిందీలో, బెంగాలీ భాషల్లో పునర్మితమై ఘన విజయం అందుకుంది. ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే అతి పెద్ద విజయాన్ని సాధించిన చిత్రంగా నిలిచింది. అలాగే మణిశర్మ అందించిన సంగీతం సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఈ సినిమా ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో మహేష్, ప్రకాష్ రాజ్ నటనకు సినీ విమర్శకులు ఫిదా అయ్యారు. తాజాగా ఫ్యాన్స్ ముందుకు ఈ చిత్రాన్ని 4కే థియేటర్ రిలీజ్ చేస్తున్నారు.

2003 జనవరి 15న రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న 4కె వెర్షన్ లో రీరిలీజ్ చేసేందుకు సిద్ధం అయ్యారు మేకర్స్. దాదాపు 20 ఏళ్ల అనంతరం భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేశారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను డిసెంబర్ 24న సాయంత్రం 7 గంటలకు యూట్యూబ్ లో రిలీజ్ చేయనున్నారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

ప్రస్తుతం మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబీ 28 చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఇప్పుడు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఇక ఈ మూవీ తర్వాత డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ ఓ మూవీ చేయనున్నారు.

ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఐపీఎల్ వద్దనుకున్నాడు.. కట్‌చేస్తే.. 56 బంతుల్లోనే బీభత్సం భయ్యో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇది ప్రపంచంలో ఎత్తైన రైల్వే వంతెన.. ఈ రైల్లో ప్రయాణం స్వర్గంలో
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువు మళ్లీ పెంపు
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
చేసిన సినిమాలన్నీ ప్లాప్.. కట్ చేస్తే.. రాజకీయ నాయకుడితో ప్రేమ..
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
Video: ఈ అమ్మాయి వల్లే చాహల్-ధనశ్రీ విడాకులు తీసుకుంటున్నారా?
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
అయ్యో ఎంత ఘోరం.. గుండెపోటుతో మూడో తరగతి బాలిక మృతి!
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
నేడు కిమ్స్ హాస్పిటల్‏కు హీరో అల్లు అర్జున్..
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
అరటిపండులో దీన్ని మిక్స్ చేసి రాస్తే.. 10 నిమిషాల్లో తెల్లజుట్టు
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
పెళ్లికి ముందే తల్లైంది.. 17 ఏళ్లకే వివాహం.. 47 ఏళ్ల వయసులో మరో ప
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా.. స్వ్కాడ్‌లో 15 మంది ఆటగాళ్లు