Nayanthara: కుర్రబ్యూటీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార.. ఆ హీరోయిన్‏కు సున్నితంగానే ఇచ్చిపడేసింది..

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ఓ మహిళా సూపర్ స్టార్ తన ముఖానికి పూర్తి మేకప్ తో ఆసుపత్రి సన్నివేశంలో కనిపించిందని.. ఎమోషనల్ సీన్ లోనూ కంటికి కాటుక.. మేకప్ వేసుకుని కనిపించిందని.. చావుబతుకుల్లో ఉండే సన్నివేశంలో కూడా మేకప్ వేసుకుని ఎలా నటిస్తారో అర్థం కాలేదంటూ నయనతార పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. తాజాగా ఈ కామెంట్స్ నయన్ స్పందించింది.

Nayanthara: కుర్రబ్యూటీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నయనతార.. ఆ హీరోయిన్‏కు సున్నితంగానే ఇచ్చిపడేసింది..
Nayanthara, Malavika Mohana
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 23, 2022 | 4:30 PM

దక్షిణాది సీని ప్రియులు ముద్దుగా లేడీ సూపర్ స్టార్ అని పిలుచుకునే హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళం, కన్నడంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ప్రస్తుతం ఆమె ప్రధాన పాత్రలో నటించిన కనెక్ట్ చిత్రం పాజిటివ్ టాక్‏‏తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈసినిమా కోసం చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది నయన్. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆమె మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను షేర్ చేసుకుంది. ఇందులో గత కొన్నాళ్లుగా తన గురించి వస్తున్న విమర్శలకు.. ఇతరులు అన్న మాటలకు తనస్టైల్లో కౌంటర్ ఇచ్చింది. ముఖ్యంగా హీరోయిన్ మాళవిక మోహనన్ చేసిన వ్యాఖ్యలకు నయనతార తనదైన శైలిలో సున్నితంగానే కౌంటరిచ్చింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాళవిక మాట్లాడుతూ.. ఓ మహిళా సూపర్ స్టార్ తన ముఖానికి పూర్తి మేకప్ తో ఆసుపత్రి సన్నివేశంలో కనిపించిందని.. ఎమోషనల్ సీన్ లోనూ కంటికి కాటుక.. మేకప్ వేసుకుని కనిపించిందని.. చావుబతుకుల్లో ఉండే సన్నివేశంలో కూడా మేకప్ వేసుకుని ఎలా నటిస్తారో అర్థం కాలేదంటూ నయనతార పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది. తాజాగా ఈ కామెంట్స్ నయన్ స్పందించింది.

నయనతార మాట్లాడుతూ.. ఆ హీరోయిన్ మాట్లాడిన ఇంటర్వ్యూ చూశాను. ఆమె మాటలు బట్టి తను నా గురించే మాట్లాడుతుందని అర్థమైంది. నేను దర్శకుడు చెప్పినట్లు చేశాను. ప్రేక్షకులను అలరించేలా సినిమాలు చేస్తుందని.. విమర్శకులు లేదా సమీక్షకులు ఆ చిత్రాలను ఆకట్టుకోవు. ఓ హాస్పిటల్ సీన్‌లో నేను పూర్తిగా మేకప్‌తో నటించానని, నా జుట్టు, గోళ్లు కూడా పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయని తను చెప్పింది. ఆసుపత్రిలో చేరినతం మాత్రాన ఎవరైనా ఉద్దేశపూర్వకంగా గందరగోళంగా కనిపించడం అవసరమా ?… రియాల్టిక్ సినిమాలకు, కమర్షియల్ చిత్రాలకు చాలా తేడా ఉంటుంది. రియాల్టిక్ చిత్రంలో అటువంటి సన్నివేశంలో ప్రామాణికంగా కనిపించడానికి చిరిగిన దుస్తులు ధరించి మేకప్ లేకుండా కనిపించాలి. కానీ కమర్షియల్ చిత్రాల్లో మనం ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. ఆ సినిమాలో నా పాత్ర డిమాండ్ కోసమే నేను అలా కనిపించాను. అది కేవలం డైరెక్టర్ సూచనల ప్రకారమే. అయితే పాత్ర, సినిమా డిమాండ్ కోసం మేకప్ లేకుండా నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. యాక్సిడెంట్ సీన్ తర్వాత నేను కాస్త జుట్టు చెరుపుకుంటేనే డైరెక్టర్ అలా అక్కర్లేదు అన్నాడు. అప్పుడు మనం ఏం చేయగలం

నానుమ్ రౌడీ సినిమాలో నేను చెవిటి అమ్మాయి పాత్రలో నటించాను. డైరెక్టర్ నాకు కథ చెప్పినప్పుడు..డిప్రెషన్ తో బాధపడుతున్న అమ్మాయి పాత్రకు సరిపోయే మేకప్ వేసుకున్నాను. కానీ డైరెక్టర్ అలా కుదరదు అని చెప్పాడు. ఆ పాత్రలోని అమ్మాయి పూర్తిగా స్వేచ్చా స్పూర్తి కలిగి ఉందని.. జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి ఇష్టపడుతుదని.. ఆమె అందంగా రెడీ అవుతుందని చెప్పారు. మనం సినిమాలో ఏం చేసిన అది ప్రేక్షకుల కోసమే. విమర్శకులను, రివ్యూలు రాసేవారిని కాకుండా ప్రేక్షకులను అలరించేందుకు సినిమాను ఎంచుకుంటాను. నన్ను ఇష్టపడని వారు నా గురించి చేసే కామెంట్స్ పట్టించుకోను. వారికి ఇతరులను విమర్శించేంత ఖాళీ సమయం ఉంటుంది. కానీ నేను చాలా బిజీగా ఉన్నాను. ఇలాంటి కామెంట్స్ పట్టించుకోవడానికి నాకు సమయం లేదు”. అంటూ చెప్పుకొచ్చారు నయనతార. తనపై వచ్చిన విమర్శలకు ఆలస్యంగా అయినా స్ట్రాంగ్ కౌంటరిచ్చిందంటూ సంతోషపడుతున్నారు లేడీ సూపర్ స్టార్ ఫ్యాన్స్.