AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి సినిమా..DSP స్ట్రీమింగ్ ఎక్కడంటే..

విజయ్ సేతుపతికి చిత్రాలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆయన ప్రధాన పాత్రలో కనిపించిన చిత్రం డీఎస్పీ.

Vijay Sethupathi: ఓటీటీలోకి వచ్చేస్తోన్న విజయ్ సేతుపతి సినిమా..DSP స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2022 | 3:30 PM

Share

ఉప్పెన సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. ఇందులో ఆయన నటనకు సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఇక ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకున్నారు. దక్షిణాదిలోనే కాదు.. ఉత్తరాదిలోనూ ఈ హీరోకు భారీ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సేతుపతి నటించే సినిమాల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాగే… కీలకపాత్రలలో విజయ్ నటిస్తుండడంతో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. అంతగా గుర్తింపు సంపాదించుకున్నారు విజయ్. ఎప్పుడూ బొద్దుగా .. రగ్గడ్ లుక్ లో కనిపించే విజయ్.. ఇటీవల సన్నగా స్టైలీష్ లుక్ లోకి మారి షాకిచ్చాడు. సన్నగా మారిన ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. ఇదిలా ఉంటే.. విజయ్ సేతుపతికి చిత్రాలకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఆయన ప్రధాన పాత్రలో కనిపించిన చిత్రం డీఎస్పీ. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమాకు పొన్ రామ్ దర్శకత్వం వహించారు. ఈనెల 2న విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో ప్రేక్షకులను అలరించనున్నట్లుగా సమాచారం. ఈ చిత్రాన్ని డిసెంబర్ 30న ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే డబ్బింగ్ వెర్షన్ లు ప్రత్యేకంగా ఓటీటీలో విడుదల చేస్తారా ? లేదా ? అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమాలో అనుక్రీతి వాస్ కథానాయికగా నటించగా.. డి ఇమ్మాన్ సంగీతం అందించగా.. స్టోన్ బెంచ్ స్టూడియోస్ బ్యానర్ పై కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించారు.

ప్రస్తుతం విజయ్ సేతుపతిలో చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా.. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..