AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable with NBK 2: వీరసింహారెడ్డితో వీరమల్లు.. అన్‌స్టాపబుల్‌లో ఇక రచ్చ రంబోలానే అంటోన్న ఫ్యాన్స్‌

అన్‌స్టాపబుల్ కు జనసేనాని, పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఎక్కడలేని ఆసక్తి వస్తోంది. పవన్‌, బాలయ్యను ఒకే స్ర్కీన్‌పై చూసేందుకు అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.

Unstoppable with NBK 2: వీరసింహారెడ్డితో వీరమల్లు.. అన్‌స్టాపబుల్‌లో ఇక రచ్చ రంబోలానే అంటోన్న ఫ్యాన్స్‌
Balakrishna, Pawan Kalyan
Basha Shek
|

Updated on: Dec 24, 2022 | 1:41 PM

Share

పేరుకు తగ్గట్టుగానే నందమూరి బాలకృష్ణ హోస్ట్‌ చేస్తోన్న అన్‌స్టాపబుల్‌ షో నాన్‌స్టాప్‌గా దూసుకెళుతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ప్రసారమవుతోన్న ఈ సెలబ్రిటీ టాక్‌ షో వ్యూస్‌ పరంగా రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా రీల్‌ లైఫ్‌, రీల్‌ లైఫ్‌లోనైనా సీరియస్‌గా కనిపించే బాలయ్య హాస్యచతురత అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే మొదటి సీజన్‌ పూర్తి చేసుకున్న ఈ ఛాట్‌ షో రెండో సీజన్‌లోనూ ఆదరణ దక్కించుకుంటోంది. సినిమా తారలతో పాటు రాజకీయ ప్రముఖులు అన్‌స్టాపబుల్‌కు వస్తున్నారు. ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్ కు జనసేనాని, పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్‌ రానున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ ఎపిసోడ్‌పై ఎక్కడలేని ఆసక్తి వస్తోంది. పవన్‌, బాలయ్యను ఒకే స్ర్కీన్‌పై చూసేందుకు అటు మెగా, ఇటు నందమూరి ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. టాలీవుడ్‌లో మాస్‌ ఫాలోయింగ్‌లో ఉన్న ఈ ఇద్దరు హీరోలు ఏం మాట్లాడుకుంటారు? షోలో బాలయ్య పవన్‌ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు? ఇద్దరూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు కాబట్టి రాజకీయ అంశాలు చర్చకు వస్తాయా? అన్నది ఇంట్రెస్టింగ్‌గా మారింది. కాగా ఈ నెల ఆఖరులో ఈ ఎపిసోడ్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే అన్‌స్టాపబుల్‌ షోకు హింట్‌ ఇచ్చేలా తాజాగా బాలయ్యను కలిశాడు పవన్‌. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తోన్న వీరసింహారెడ్డి సెట్స్‌కు వెళ్లిన పవర్‌స్టార్‌ అక్కడ ఇద్దరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు. ఈ ఫొటోలు ఒక్కసారిగా వైరల్‌గా మారాయి. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. కాగా బాలయ్య వీర సింహా రెడ్డి షూటింగ్, పవన్ కళ్యాణ్‌ హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ఒకే చోట జరుగుతున్నాయి. ఈ గ్యాప్‌లోనే ఇలా మీటింగ్ జరిగినట్టు కనిపిస్తోంది. కాగా ఈ మీటింగ్‌లోనే అన్‌స్టాపబుల్‌ షోకు సంబంధించి చర్చలు కూడా జరిగినట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
కత్రినా ఒత్తైన జుట్టు సీక్రెట్‌.. ఖరీదైన ప్రొడక్ట్స్‌ కాదట.
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
వన్డే టీమ్ నుంచి హార్ధిక్ పాండ్యా ఔట్!
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
మహిళలకు అదిరిపోయే శుభవార్త.. ఒక్కరోజే రూ. 4 వేలు తగ్గిన బంగారం..
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో
జపాన్‌లో జీవితంపై ఐఐఎం కాశీపూర్‌.. పూర్వ విద్యార్థి వీడియో