Thamannah: కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మిల్కీబ్యూటీ.. అప్పుడే తన పని అయిపోయిందనుకుందట..

ప్రస్తుతం తమన్నా వయసు 35 కాగా...ఇప్పటికీ పెళ్లి ఊసేత్తకుండా చేతి నిండా ప్రాజెక్టులతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ఇటీవల పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తమన్నా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Thamannah: కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టిన మిల్కీబ్యూటీ.. అప్పుడే తన పని అయిపోయిందనుకుందట..
Tamannah
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2022 | 2:45 PM

సౌత్ ఇండస్ట్రీలో ఉన్న అగ్రకథానాయికలలో తమన్నా ఒకరు. ఫ్యాన్స్ అంతా మిల్కీబ్యూటీ అని పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ.. తెలుగుతోపాటు.. తమిళ్, కన్నడ, హిందీ భాషలలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దాదాపు రెండు దశాబ్దాలుగా స్టార్ హీరోయిన్‏గా కొనసాగుతూ.. చేతిలో వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది తమన్నా. ఇటీవల ఎఫ్ 3, బబ్లీ బౌన్సర్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ అమ్మడు.. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమాలో నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కీర్తి సురేష్ చిరు చెల్లిగా కనిపించనుంది. ప్రస్తుతం తమన్నా వయసు 35 కాగా…ఇప్పటికీ పెళ్లి ఊసేత్తకుండా చేతి నిండా ప్రాజెక్టులతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ కొనసాగిస్తోంది. ఇటీవల పుట్టినరోజు వేడుకలను జరుపుకున్న తమన్నా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తాను ముంబయిలో ప్లస్ 2 చదువుకుంటున్న సమయంలోనే సినీ రంగ ప్రవేశం చేశానని చెప్పారు. అప్పుడు తన వయసు కేవలం 15 ఏళ్లని.. మొదటిగా సాంద్ సా రోషన్ షహానా అనే హిందీ చిత్రంలో నటించినట్లు తెలిపారు. అయితే తొలి సినిమా ప్లాప్ అయ్యిందని.. ఇక అదే ఏడాదిలో మంచు మనోజ్ నటించిన శ్రీ చిత్రం ఆఫర్ వచ్చిందని.. కానీ అది కూడా సక్సెస్ కాలేదని అన్నారు. దీంతో తన పని అయిపోయిందని భావించానని.. అలాంటి సమయంలోనే డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ చిత్రంలో నటించే ఛాన్స్ వచ్చిందని.. ఈ సినిమా ఊహించని విజయాన్ని అందుకుందని. ఆ తర్వాతే తనకు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయన్నారు.

కేవలం వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ ప్లాట్ ఫాంలోనూ సత్తా చాటుతుంది తమన్నా. అలాగే హీరోయిన్ గానే కాకుండా..స్పెషల్ సాంగ్స్ లోనూ అలరించింది. ఇక నితిన్ నటించిన మ్యాస్ట్రో సినిమాతో విలనిజంతో కూడా ఆకట్టుకుంది. ప్రస్తుతం భోళాశంకర్ సినిమాతో బిజీగా ఉంది తమన్నా.

ఇవి కూడా చదవండి