VeeraSimha Reddy: వీరసింహా రెడ్డి నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. సెన్సేషనల్ స్పెషల్ సాంగ్‏లో ఇరగదీసిన బాలయ్య..

ముఖ్యంగా సుగుణ సుందరి పాట బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు, ఆల్బమ్ లోని ప్రత్యేక పాట మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ సాగే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

VeeraSimha Reddy: వీరసింహా రెడ్డి నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. సెన్సేషనల్ స్పెషల్ సాంగ్‏లో ఇరగదీసిన బాలయ్య..
Veera Simha Reddy
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 24, 2022 | 3:51 PM

గాడ్ ఆఫ్ మాసస్ నటసింహ నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌ బస్టర్ మేకర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ చూడని మాస్, యాక్షన్-ప్యాక్డ్ పాత్రలో బాలయ్య కనిపించనున్నారు. టాప్ ఫామ్‌ లో ఉన్న ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ జై బాలయ్య, సెకండ్ సింగిల్ సుగుణ సుందరి స్మాషింగ్ హిట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా సుగుణ సుందరి పాట బాలకృష్ణ ఎక్స్ట్రాడినరీ డ్యాన్స్‌లతో అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు, ఆల్బమ్ లోని ప్రత్యేక పాట మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ సాగే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్.

తాజాగా విడుదలైన ఈ స్పెషల్ సాంగ్ లో మలయాళీ బ్యూటీ హానీ రోజ్ నటించగా.. మాస్ ఎనర్జిటిక్ స్టెప్పులతో ఇరగదీశారు బాలయ్య. ఊరమాస్ స్టెప్పులతో అభిమానులను ఉర్రూతలూగించారు. చాలా కాలం తర్వాత ఫుల్ మాస్ రెంజ్ డ్యాన్స్ తో ఆశ్చర్యపరిచారు బాలయ్య. ఇక ఈపాటతో మరోసారి తమన్ తనలోని మాస్ ను బయటకు తీశారు. మేకర్స్ ఇప్పటికే దీనిని ‘ది సెన్సేషనల్ స్పెషల్ సాంగ్ ఆఫ్ ది ఇయర్’ అని పిలవడంతో ఎన్నో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్ కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ స్వాగ్ ఇచ్చేశారు. మొత్తానికి ఈ పాటలో బాలయ్య రాకింగ్‌ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్ ఆలపించారు. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ మూవీపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి.

ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చివరి పాటను షూట్ చేయడంతో మేకర్స్ త్వరలోనే చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ అంచనాలున్న ఈ చిత్రం జనవరి 12, 2023న సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
అమెరికాలో భూమికి 200 అడుగుల కింద భారీ బంకర్‌.! అదిరిపోయిన ప్లాన్.
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
చేపల కోసం వల వేస్తే.. ఏం చిక్కిందో చూడండి.! వీడియో వైరల్..
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కిరాణా షాపులు కనుమరుగయ్యే కాలం వచ్చిందా.? కారణం అదేనా.!
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
కదులుతున్న బస్సులో యువకుడు చేసిన పనికి అంతా షాక్‌.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
రైతంటే నువ్వే అన్నా.. నీ ఐడియాకు సలామ్.! వీడియో..
"వితౌట్ ఐస్'' అని చెప్పడం మరిచిపోతున్నారా.? అంతే సంగతులు..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
ఎక్కడ చూసినా పుష్ఫ మేనియానే.. ముంబయిలో అట్టహాసంగా ఈవెంట్‌..
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
అమెరికాలో ఆయాలుగా భారతీయ విద్యార్థులు.! పార్ట్‌ టైమ్‌ లేక అవస్థలు
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
చితిపై నుంచి లేచొచ్చిన మనిషి.! ఆ వైద్యుల నిర్లక్ష్యానికి పరాకాష్ట
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..
తల్లి ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఉంటుందా.? ఏనుగుల చక్ర వ్యూహం..