Karuna Bhusan: ‘నన్ను చాలామంది మోసం చేశారు.. ఎవరిని గుడ్డిగా నమ్మను’.. సీరియల్ నటి కరుణ భూషణ్ కామెంట్స్..
మొగలిరేకులు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది కరుణ. ఆ తర్వాత శ్రావణ సమీరాలు సీరియల్ తో మరోసారి మెప్పించింది. ప్రస్తుతం పలు సీరియల్లలో నటిస్తూ బిజీగా ఉంది.
కరుణ భూషణ్.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఒకప్పుడు టెలివిజన్ రంగంలో సంచలనాలు సృష్టించిన మొగలిరేకులు సీరియల్ ద్వారా తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చింది కరుణ. ఆ తర్వాత శ్రావణ సమీరాలు సీరియల్ తో మరోసారి మెప్పించింది. ప్రస్తుతం పలు సీరియల్లలో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత.. ఫ్యామిలీ విషయాల గురించి అనేక ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తను పుట్టి.. పెరిగింది హైదరాబాద్ లోనే అని.. కానీ వాళ్ల అమ్మగారు బాంబే కావడంతో తను మహారాష్ట్రకు చెందిన అమ్మాయి అని చెప్పుకొచ్చింది. అలాగే దాదాపు 30 సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో యాక్ట్ చేసినట్లు.. ఆహా సినిమాతో వెండితెరపై కనిపించినట్లు తెలిపింది.
తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ.. “2007లో నా భర్త నాకు ప్రపోజ్ చేశాడు. ఐ లవ్యూ అని చెప్పలేదు. పెళ్లి చేసుకుంటావా అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. తను సైలెంట్, వైలెంట్. 15 ఏళ్లుగా మా ప్రయాణం అద్భుతంగా సాగుతుంది. మేము పారిపోయి ప్రేమవివాహం చేసుకున్నాం. తను బాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్. మాకు ఒక బాబు. ఆ తర్వాత మధ్యలో ఒకసారి మిస్ క్యారేజ్ అయ్యింది. ఆ సమయంలోనే నేను ఒక సీరియల్ నుంచి తప్పుకున్నాను. సినిమాల్లోకి రాకపోయుంటే.. డాక్టర్ అయ్యుండేదాన్ని.
అలాగే నాకు చాలామంది హ్యాండిచ్చారు. మోసం చేశారు. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. కానీ నాకు నేనే ధైర్యం చెప్పుకుని.. జీవితంలో ముందుకు సాగుతున్నాను. ఎవ్వరిని గుడ్డిగా నమ్మవద్దని నిర్ణయించుకున్నాను. ఇక నా భర్త నన్ను చాలా ప్రేమిస్తాడు. ప్రస్తుతం జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. మెగాస్టార్ చిరంజీవి, బాలయ్య, నాగార్జున గారి సినిమాల్లో నటించాను. “అంటూ చెప్పుకొచ్చింది.