AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మరింత ముదిరిన సినీ సంక్షోభం!…కొలిక్కిరాని రెండు వర్గాల చర్చలు!

28వేల మంది సినీ కార్మికులు. అంటే అర్థం.. 28వేల కుటుంబాలు అని. ఒక్క సమ్మెతో ఇన్ని వేల ఫ్యామిలీలు వీధినపడ్డాయి. షూటింగ్స్‌ లేవు. యూనియన్లు, నిర్మాతల మధ్య గొడవ తెగడం లేదు. యూనియన్‌ వద్దంది కదా అని పనికెళ్లకుండా కూర్చుంటే.. ఇంటిల్లిపాదికి తిండిపెట్టేదెట్టా? అందుకే సీరియల్‌ షూటింగ్‌కు రమ్మని పిలిస్తే వెళ్లాడో కార్మికుడు. సమ్మె ప్రకటిస్తే అలా ఎలా వెళ్లి పనిచేస్తావ్ అని కొట్టాడు యూనియన్‌ లీడర్‌ ఒకరు. ఇప్పటిదాకా షూటింగ్స్‌కు వెళ్లకపోవడం, అడ్డుకోవడమే చూశాం. ఇప్పుడేకంగా కొట్టుకునేదాకా వెళ్లింది. రేప్పొద్దున ఇంకెందాక వెళ్తుందో? నిర్ణయం తీసుకోవడంలో పూట దాటుతున్న కొద్దీ పరిణామాలు దారుణంగా మారిపోతున్నాయి. వీటన్నింటి మధ్య కార్మికుల పేగుల్లోంచి వస్తున్న ఆకలి అరుపులు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లో టాలెంట్‌ దొరక్క బయటివాళ్లను తెచ్చుకుంటున్నామని నిర్మాతలు.. పాన్‌ఇండియా హిట్లు ఏ కార్మికులతో కొట్టారో చెప్పాలని యూనియన్లు. ఎడతెగని పంచాయితీ నడుస్తోంది. ఇంత తీవ్రమైన సమస్యకు పరిష్కారం దొరకాల్సింది చిరు దగ్గరేనని అంతా వెళ్లి ఆయన్నే అడుగుతున్నారు. ఈ సినీ సంక్షోభం ఎప్పటికి పరిష్కారం అవును? కంప్లీట్‌ డిటైల్స్‌

Tollywood: మరింత ముదిరిన సినీ సంక్షోభం!...కొలిక్కిరాని రెండు వర్గాల చర్చలు!
Tollywood Shutdown
Ram Naramaneni
|

Updated on: Aug 06, 2025 | 9:29 PM

Share

పాన్‌ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తున్నాం మనం. వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌ వరకూ వెళ్లాం. ఒక్కో హీరోకి వంద కోట్లకు మించి రెమ్యునరేషన్‌ ఇస్తున్నాం. కొత్త సినిమా రిలీజ్‌ అయితే.. వారంలోనే కలెక్షన్స్ రాబట్టుకోవడం కోసం టికెట్ రేట్లను భారీగా పెంచుకునేందుకూ పర్మిషన్‌ ఇస్తున్నాం. ఇంతింత ఖర్చు పెడుతున్న సినీ పరిశ్రమ.. ఒక సినీ కార్మికుడొచ్చి తనకు 400 రూపాయల వేతనం పెంచమని అడిగితే ఇంత రాద్ధాంతం ఏంటసలు? అది కూడా మూడేళ్ల తరువాత అడుగుతుంటే అవతలకి పొమ్మనడమేంటి? పైకి ’30 శాతం’ అనే నెంబర్‌ ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ.. సగటు కార్మికుడికి పెరిగేది 300, 400 రూపాయలే. దానికే.. ఇండస్ట్రీలో మాఫియా, ఇండస్ట్రీలో దందా, ఇండస్ట్రీలో టాలెంట్‌ తొక్కేస్తున్న యూనియన్లు అనే మాటలేంటి? కొందరు నిర్మాతల నుంచి ఎందుకొస్తున్నాయి ఈ కామెంట్లు?  మరోసారి చెప్పుకుందాం అదే మాటని. రోజువారీ వేతనాన్ని 400 పెంచండయ్యా అని అడుగుతుంటే.. కొందరు నిర్మాతలు కొత్త సమస్యను పుట్టిస్తున్నారు. టాపిక్‌ను మరోవైపుకు డైవర్ట్‌ చేస్తున్నారు. టాలీవుడ్‌లో టాలెంట్‌ దొరకడం లేదట. చాలా పెద్ద స్టేట్‌మెంట్స్‌ ఇస్తున్నారు ఒకరిద్దరు నిర్మాతలు. సరే టాలెంట్‌ దొరకడం లేదు అనుకుందాం. ఆ స్కిల్స్‌ నేర్పించాల్సింది ఎవరు? ఇంత పెద్ద ఇండస్ట్రీ, ఇండియన్‌ సినిమానే ఛాలెంజ్‌ చేసే రేంజ్‌కి వెళ్లిన ఇండస్ట్రీ.. తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్‌ హంట్‌ చేయలేదా? ఉన్నవి 24 క్రాఫ్ట్స్‌. అంటే 24 విభాగాలు. ఏం.. వాటిని డెవలప్‌చేసుకోడానికి స్కిల్ ప్రోగ్రామ్‌ పెట్టుకోలేదా?...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి