ఏం సినిమా రా బాబూ.. దెబ్బకు ప్రపంచ బాక్సాఫీస్ షేక్ వీడియో
ఈ మధ్య థియేటర్స్, ఓటీటీలలో హారర్ జానర్ కంటెంట్ ఉన్న చిత్రాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఓ హారర్ మూవీ ఏకంగా 17 వేల 400 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. నాలుగు పార్ట్‌లుగా వచ్చిన ఆ సినిమాని జనం ఎందుకు ఆదరించారో చూద్దాం. హారర్ సినిమాలు చూడడం మీకు ఇష్టమా.. ? అయితే మీరు ఈ మూవీ చూసే ఉంటారు. దెయ్యాల ఫామ్ హౌస్.. ఎంతో ధైర్యం ఉన్న జంట.. అనుక్షణం ఉత్కంఠ, భయంతో సాగే ఈ సినిమా పేరు ది కంజూరింగ్.
దయ్యాలు ఆత్మలు, నమ్మకం, భయం మధ్య జరిగే సంఘర్షణను ఈ మూవీ చూపిస్తుంది. 2013లో విడుదలై నిజ జీవిత పారానార్మల్ పరిశోధకులు ఎడ్, లోరైన్ వారెన్ కథను చూపించింది. జేమ్స్ వాన్ దర్శకత్వంలో ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ది కంజురింగ్.. మొత్తం నాలుగు భాగాలుగా తెరకెక్కించారు. 2013 నుంచి 2025 వరకు నాలుగు భాగాలు విడుదలయ్యాయి. 2013 తర్వాత 2016లో ది కంజురింగ్ 2 విడుదలైంది. ఆ తర్వాత 2021లో విడుదలైన ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ మరో మలుపు తిప్పింది. 1981లో ఆర్నే జాన్సన్ పై జరిగిన వాస్తవ విచారణను ఈ సినిమా చూపిస్తుంది. ది కంజురింగ్ యూనివర్స్ మొత్తం 1817 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా.. రూ.17,400 కోట్లకు పైగా వసూలు చేసింది.కంజురింగ్ యూనివర్స్ సినిమా చరిత్రలోనే అత్యంత విజయవంతమైన, హర్రర్ ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచింది. ఇక ఈ యూనివర్స్ లో చివరి భాగమైన ది కంజురింగ్ లాస్ట్ రైట్స్ త్వరలోనే తెరపైకి రానుంది. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 5న విడుదల కానుంది.
మరిన్ని వీడియోల కోసం :
పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో
కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
విశ్వానికి ముగింపు ఎప్పుడంటే వీడియో
తేళ్ల పంచమి.. వాటిని ముఖంపై వేసుకుని ఆటలు.. వామ్మో ఇదేం పండుగ వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
