కూరగాయల్ని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదంటే?
కూరగాయలని నీటిలో ఉడికిస్తున్నారా? ఆవిరి పడుతున్నారా? ఏది మంచిదో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఆహారంలో పోషక విలువలను అత్యధికంగా నిలుపుకోవాలంటే ఆవిరి మీద ఉడికించడం మంచిదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నీటిలో కరిగే బి,సి విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఆవిరిలో ఉడికించే పద్ధతిలో ఆహారం నేరుగా నీటితో సంబంధం లేకుండా ఆవిరితో మాత్రమే ఉడుకుతుంది కాబట్టి పోషకాలు నీటిలో కరిగి బయటికి పోకుండా ఉంటాయి.
ఈ పద్ధతికి అదనపు నూనె లేదా కొవ్వు అవసరం లేదని, ఇది ఆరోగ్యకరమైన ఎంపిక అని నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహారాలను నీటిలో త్వరగా ఉడికించవచ్చు. పెద్ద మొత్తంలో ఆహారాన్ని మండటానికి అనుకూలంగా ఉంటుందని చాలామంది అనుకుంటారు. కానీ ఏ,బి విటమిన్లు ఇంకొన్ని ఖనిజాలు వంట నీటిలో కరిగిపోతాయి. వంట నీటిని పారబోసినట్లయితే ఈ పోషకాలను కోల్పోతాం. కానీ సూప్‌లు, పాస్తా, అన్నం, పప్పులు, ఉడికించిన గుడ్లు వంటి వంటకా లకు నీటిలో ఉడికించడం తప్పనిసరి. ప్రతి వంట పద్ధతికి దానిదైన ప్రయోజనాలు ఉంటాయని వండే ఆహారాన్ని బట్టి సరైన పద్ధతిని ఎంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గాలనుకున్నా, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలన్నా, లేదా మెరుగైన చర్మం కావాలనుకున్నా ఆవిరితో ఉడికించిన ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు. అంతేకాకుండా ఆవిరి మీద ఉడికించడం వల్ల కూరగాయలు సహజ రుచిని మెరుగుపడుతుంది. నిపుణుల సూచనల ప్రకారమే మీ అవగాహన కోసం మాత్రమే మీకు ఈ సమాచారం అందించాం. ఆరోగ్య సమస్యలు ఉన్న వీటిని పాటించే ముందు వ్యక్తిగత వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

