పాత, చినిగిన బట్టలు దాస్తున్నారా వీడియో
నీటిలోని మొసలికి చిక్కితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ఎంత పెద్ద ఏనుగు అయినా నీటిలోని మొసలి బలం ముందు నిలవలేదు. అయితే వైరల్ అవుతున్న ఓ వీడియోలో ఓ జీబ్రా నీటిలోని మొసలి గుంపుకు దొరికిపోయింది. వాటి బారి నుంచి ప్రాణాలతో బయటపడడానికి ధైర్యంగా పోరాడింది. ఆ వీడియోను ఓ వ్యక్తి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు
నది దాటుతున్న జీబ్రాకు ఊహించని ఘటన ఎదురైంది. అప్పటికే వేటకోసం వేచి చూస్తున్న మొసళ్లు జీబ్రా రాగానే చుట్టుముట్టాయి. మొసళ్లన్నీ చుట్టూ చేరడంతో జీబ్రా షాక్ అయింది. వాటిలో ఓ మొసలి జీబ్రాను కొరికే ప్రయత్నం చేసింది. దాని నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. మొసలి నోటికి తన నోటితో పట్టుకొని దాని నుంచి తప్పించుకునేందుకు జీబ్రా ధైర్యంగా పోరాడింది. మొసలి నోటిని తన నోటితో పట్టుకొని కురుకేసింది. మరికొన్ని మొసళ్లు దాడి చేసినా వాటిని కూడా ధైర్యంగా ఎదుర్కొని ఒడ్డుపైకి చేరుకుంది. ఈ వైరల్ వీడియో ఎక్కడ ఏ ప్రాంతంలో షూట్ చేశారో వివరాలు తెలియరాలేదు. కానీ ఇప్పటివరకు 1.5 కోట్ల మంది చూశారు. 1.4 లక్షల కంటే ఎక్కువ మంది వీడియోను లైక్ చేశారు. వీడియోపై స్పందించిన నెటిజన్లు జీబ్రా ధైర్యం ముందు మొసలి బలం నిలవలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు. జీవితంలో చివరి నిమిషం వరకు ధైర్యంగా పోరాడాలని ఈ జీబ్రా పాఠం నేర్పుతుందని మరొకరు తెలిపారు. క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ ఆశ కోల్పోకుండా ఫైట్ చేయాలని ఇంకొకరు కామెంట్ చేశారు.
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!
దారుణం.. మహిళను చంపి బిర్యానీ వండి..
ప్రాంక్ మెసేజ్‌తో రూ.30 లక్షల గుట్టురట్టు!
పిజ్జా సైజు తగ్గింది.. ఫైన్ పడింది..
ఇండోనేషియా మోడల్ వ్యవసాయంతో ఏలూరు రైతు అద్భుతాలు..
ఉద్యోగం మానేయాలనుకుంటున్నారా? HR మేనేజర్ షాకింగ్ వార్నింగ్!
గోల్కొండలో 400 ఏళ్ల నాటి సమాధుల దగ్గర కలకలం!

