Actress Hema: శివగామి లాంటి పాత్రలు ఇచ్చినా సినిమాలు చేయనంటోన్న హేమ.. ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
ఒకప్పుడు తెలుగు సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా, లేడీ కమెడియన్ గా బిజి బిజీగా గడిపింది హేమ. బిగ్ బాస్ వంటి టీవీ రియాలిటీ షోల్లోనూ సందడి చేసింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ్ సినిమాల్లో మెరిసిన ఈ సీనియర్ నటీమణి ఇప్పుడు నటనకు గుడ్ చై చెప్పేసింది.

1993లో టీవీ నటిగా కెరీర్ ప్రారంభించింది హేమ. నటిగా తెలుగుతో పాటు తమిళ, హిందీ చిత్రాల్లోనూ మెరిసింది. బిగ్ బాస్ వంటి ప్రముఖ రియాలిటీ షోల్లో నూ సందడి చేసింది. ఇప్పటివరకు సుమారు 350-400 సినిమాల్లో నటించిందీ అందాల తార. అయితే కొన్నేళ్ల క్రితం హేమ జీవితంలో జరిగిన ఓ ఘటన ఆమెకు మర్చిపోలేని మచ్చను మిగిల్చింది. అదేంటంటే.. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని డ్రగ్, రేవ్ పార్టీలో హేమ పాల్గొన్నట్లు వార్తలు వచ్చాయి. ఆమెపై పోలీస్ కేసు కూడా నమోదైంది. ఈ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు జైలు జీవితం కూడా గడిపింది. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చేసింది. డ్రగ్స్ కేసులో తాను నిర్దోషినని హేమ చెప్పుకొచ్చినా అప్పటికే ఆమెపై పూర్తి నెగెటివిటీ వచ్చేసింది. సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ జరిగింది.
కొన్నాళ్ల క్రితం వరకు నటిగా బిజీగా గడిపిన హేమ గత 4, 5 ఏళ్లుగా మాత్రం పెద్దగా సినిమాలు చేయలేదు. 2021లో క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కనిపించిన హేమ ఈ ఏడాది రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాలో ఓ చిన్న రోల్ పోషించింది. అంతే మరే మూవీలోనూ ఈ నటి కనిపించలేదు. తాజాగా హైదరాబాద్ లోని ఓ షాప్ ఓపెనింగ్ లో కనిపించిన హేమకు సినిమాల్లో ఎప్పుడు కనిపిస్తారు? అన్న ప్రశ్న ఎదురైంది. దీనికి ఆమె ఆసక్తికర సమాధానం చెప్పింది.
పార్టీ ఈవెంట్ లో హేమ..
View this post on Instagram
‘నేను సినిమాల్లో నటించడం మానేశాను. ఇప్పుడు లైఫ్ లో చిల్ అవుతున్నాను. హ్యాపీగా ఉన్నాను. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. 14 ఏళ్లప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఇక చాలని పిస్తోంది. ఇంకెంత కాలం కష్టపడాలి? ఎవరికోసం కష్టపడాలి. నేను నా కోసం హ్యాపీగా ఉండటానికి వీలైనంతవరకు ప్రయత్నిస్తున్నాను. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను.ఏమో రాబోయే రోజుల్లో బోర్ కొట్టి యాక్ట్ చేయాలనిపిస్తే అప్పుడు సినిమాల సంగతి చూస్తా. ఇప్పటికైతే శివగామి లాంటి పాత్ర ఇచ్చినా సరే సినిమాల్లో నటించను. అంత ఇంట్రెస్ట్ కూడా లేదు’ అని హేమ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ నటి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
పురందేశ్వరితో హేమ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








