Vijayashanti: ‘నన్ను సూపర్ స్టార్ చేసింది ఈ సినిమానే’.. 40 ఏళ్ల నాటి అనుభవాలను గుర్తుచేసుకున్న రాములమ్మ
ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది విజయశాంతి. తన అభినయంతో లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అనే బిరుదులు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న ఆమె తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

ఇప్పటివరకు సుమారు 180కు పైగా సినిమాల్లో నటించారు విజయశాంతి. తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. రాజకీయ అరంగేట్రం చేసిన తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్న విజయశాంతి మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చారు. అలాగే ఈ ఏడాది అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకులను మరోసారి పలకరించారు. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన హీరో కల్యాణ్ రామ్ విజయశాంతి కుమారుడిగా నటించాడు. భారీ అంచనాలతో రిలీజైన ఈ సినిమా ఓ మోస్తరుగా ఆడింది. కాగా దీని తర్వాత మరే సినిమాలోనూ లేడీ సూపర్ స్టార్ కనిపించలేదు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా రాజకీయాల్లో ఉంటున్నారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆమె అప్పుడుప్పుడు సినిమాల గురించి ఆసక్తికర విషయాలను అందులో పంచుకుంటుంది. అలా తాజాగా సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ షేర్ చేశారు విజయ శాంతి . 40 ఏళ్ల క్రితం తాను నటించిన ఒక సినిమాను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు
‘1985 అక్టోబర్ 11….. 2025 అక్టోబర్ 11…. నేటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం. నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ ‘ప్రతిఘటన’. దర్శకులు టీ కృష్ణ గారికి, నిర్మాత రామోజీరావు గారికి, అద్భుతమైన ‘ఈ దుర్యోధన దుశ్శాసన’ పాటను అందించిన వేటూరి గారికి, పాడిన ఎస్ జానకి అమ్మకు, మాటల రచయిత MVS హరనాథ్ రావు గారికి, సహ నటి నటులకు, సాంకేతిక నిపుణులకు విశేషంగా ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. ధన్యవాదములతో.. హర హర మహాదేవ్’ మీ విజయశాంతి’ అని ట్విట్టర్ లో పోస్ట్ పెట్టింది. అలాగే ఇందులోని దుర్యోధన దుశ్శాసన సాంగ్ ను కూడా షేర్ చేసింది.
విజయ శాంతి ట్వీట్..
1985 అక్టోబర్ 11…..
2025 అక్టోబర్ 11….
నేటికీ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతిఘటన చిత్రం నాకు ఎప్పటికీ ఎంతో ప్రత్యేకం.
నన్ను సూపర్ స్టార్ గా నిలబెట్టిన అత్యంత విజయవంతమైన సెన్సేషనల్ హిట్ “ప్రతిఘటన”.
దర్శకులు శ్రీ టీ కృష్ణ గారికి, నిర్మాత శ్రీ రామోజీరావు గారికి,… pic.twitter.com/ZcR4eyfBDC
— VIJAYASHANTHI (@vijayashanthi_m) October 11, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




