Actress Sana Begum: ఆ డైరెక్టర్ చాలా ఇబ్బందిపెట్టాడు.. కన్నడ ఇండస్ట్రీపై నటి సన షాకింగ్ కామెంట్స్..
నటిగా తాను ఏ పాత్ర వచ్చినా చేస్తుంటా అని.. చిన్న పెద్ద అనే తేడా అన్ని పాత్రలు చేశానని.. కానీ చాలా మంది రమ్యూనరేషన్స్ ఎగ్గొట్టారని అన్నారు. పెద్ద బ్యానర్స్ కాదని.. కేవలం చిన్న బ్యానర్స్ వాళ్లని నమ్మి సినిమా చేస్తే పారితోషికం ఎగ్గొడతారని అన్నారు.
![Actress Sana Begum: ఆ డైరెక్టర్ చాలా ఇబ్బందిపెట్టాడు.. కన్నడ ఇండస్ట్రీపై నటి సన షాకింగ్ కామెంట్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/sana-begum.jpg?w=1280)
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటీనటులలో సన ఒకరు. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో దాదాపు 600 పైగా చిత్రాల్లో నటించి మెప్పించారు. అనేక సీరియల్స్ లోనూ కీలకపాత్రలలో నటించారు. అయితే ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై కన్నడ నటీనటుల హావా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రసారమవుతున్న సీరియల్స్ అన్నింటిలోనూ ఇతర భాష నటీనటులే ఉన్నారు. కానీ కన్నడలో మాత్రం తెలుగు వాళ్లని అంతగా పట్టించుకోరని.. వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వరని చెప్పుకొచ్చారు సన. నటిగా తాను ఏ పాత్ర వచ్చినా చేస్తుంటా అని.. చిన్న పెద్ద అనే తేడా అన్ని పాత్రలు చేశానని.. కానీ చాలా మంది రమ్యూనరేషన్స్ ఎగ్గొట్టారని అన్నారు. పెద్ద బ్యానర్స్ కాదని.. కేవలం చిన్న బ్యానర్స్ వాళ్లని నమ్మి సినిమా చేస్తే పారితోషికం ఎగ్గొడతారని అన్నారు.
తాను తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో పలు చిత్రాలు చేశానని.. కానీ కన్నడ ఇండస్ట్రీలో ఓ డైరెక్టర్ తనను చాలా ఇబ్బందిపెట్టారని అన్నారు. “కన్నడలో సైనిక సినిమా చేస్తున్నప్పుడు ఆ డైరెక్టర్ చాలా ఇబ్బందిపెట్టాడు. పెద్ద పేజీ డైలాగ్ ఇచ్చి ప్రామిటటింగ్ లేకుండా చెప్పమన్నారు. సినిమాల్లో ప్రామిటింగ్ ఉండదు. మేమే చెప్పేస్తాం. నేర్చుకుని చెప్పేదాన్ని. కానీ మళ్లీ మళ్లీ చెప్పాలన్నాడు. చాలా రకాలుగా డిస్ట్రబ్ చేసాడు. కన్నడ వాళ్లు బయట ఇండస్ట్రీ వాళ్లను యాక్సెప్ట్ చేసేవాళ్లు కాదు. మన దగ్గర ఆర్టిస్టులు కదా.. మన వాళ్లకి ఎంకరేజ్ చేయాలని అనుకుంటారు. వాళ్ల వరకూ వాళ్ల నిర్ణయం కరెక్టే. కానీ నా తప్పేం లేదు కదా. వాళ్లు పిలిచారు. నేను వెళ్లి పనిచేశాను. ఆ సినిమాకు మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేశాను.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/krishnavamsi.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/nani-18.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/aishwarya-rajesh.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/03/keerthy-suresh-16.jpg)
ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు కూడా షూటింగ్స్ కు వెళ్లాను. కొన్ని ఆపరేషన్ అయ్యి.. కుట్లు కూడా తీయకుండానే సెట్ కు వెళ్లాను. భద్ర సినిమాకు అలాగే చేశాను. కడుపు పట్టుకుని షాట్ కు వెళ్లేదాన్ని తిరిగి వచ్చి పడుకునేదాన్ని.. ఆ సినిమా అలాగే చేశాను. నటను ఇష్టపడినప్పుడు ఇలాంటివి ఏవీ గుర్తురావు” అంటూ చెప్పుకొచ్చారు సన.