Krishna Vamsi: ఆ సినిమా చూస్తూ కృష్ణవంశీ కంటతడి.. ప్రకాష్ రాజ్ సలహాతో ‘రంగమార్తాండ’ బాధ్యతలు..

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని.. సూపర్ డీసెంట్ హిట్‏గా నిలిచింది.

Krishna Vamsi: ఆ సినిమా చూస్తూ కృష్ణవంశీ కంటతడి.. ప్రకాష్ రాజ్ సలహాతో 'రంగమార్తాండ' బాధ్యతలు..
Krishnavamsi
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2023 | 8:30 AM

చాలా కాలం తర్వాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం రంగమార్తాండ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ అందుకుని.. సూపర్ డీసెంట్ హిట్‏గా నిలిచింది. సినీ ప్రియులు.. విమర్శకులు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇవ్వడమే కాకుండా.. మరోసారి కృష్ణవంశీ దర్శకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ మూవీ విజయాన్ని అందుకోవడంపై కృష్ణవంశీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రంగమార్తాండ విజయం ఇలాంటి మరిన్ని ప్రయోగాలు చేయడానికి కావాల్సిన నైతిక స్థైర్యాన్ని అందించిందన్నారు.

మరాఠీలో విజయవంతమైన నటసామ్రాట్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ కృష్ణవంశీ మాట్లాడుతూ.. “ప్రకాష్ రాజ్ సలహాతో తొలిసారి నటసామ్రాట్ సినిమా చూశా. అది చూస్తున్నప్పుడే భావోద్వేగాల్ని నియంత్రించుకోలేక కన్నీళ్లు పెట్టుకున్నా. అందులోని ఫ్యామిలీ ఎమోషన్స్ నాకు బాగా నచ్చాయి. ఇటీవల కుటుంబ బంధాల మధ్య దూరం పెరుగుతోంది. ఇలాంటి సమయంలో ఈ కథ చెబితే బాగుంటుందనిపించింది. ప్రకాష్ కూడా ఈ కథ నువ్వు డైరెక్ట్ చేస్తేనే బాగుంటుందని చెప్పడంతో ఈ సినిమా రూపొందించాను. మాతృకతో పోల్చితే చాలా మార్పులు చేశాం. తెలుగు భాష గొప్పతనాన్ని చెప్పాడంతోపాటు.. సమాజంలోని అనేక సమస్యల్ని చర్చించాం” అన్నారు.

ఇవి కూడా చదవండి

“ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ను నువ్వు చెత్త నటుడివి అని తిట్టాలన్నా.. చెంప దెబ్బ కొట్టాలన్నా ఆ స్థాయి ఉన్న నటుడు కావాలి. అలాగే ఆ పాత్ర ప్రేక్షకులకు ఓ మంచి సర్ ప్రైజ్ గా ఉండాలి. వీటన్నింటికీ న్యాయం చేయాలంటే నాకు ముందుగా మనసులో వచ్చిన రూపమే బ్రహ్మానందం. వెంటనే చక్రపాణి పాత్రను బ్రహ్మానందంతో చేయించాలనుకుంటున్నాను అని ప్రకాష్ తో చెప్పాగానే తను వెంటనే చాలా బాగుంటుందని అన్నాడు. ఈ సినిమాలో వచ్చే ఆసుపత్రి సీన్ బ్రహ్మానందం మూడు నెలలపాటు బట్టీ పట్టారు. ప్రకాష్ రాజ్ ను చెంప దెబ్బ కొట్టే సీన్ చేసే సమయంలో ఆయన భోజనం కూడా మానేశారు. ఆ పాత్ర కోసం బ్రహ్మానందం చాలా కష్టపడ్డారు. త్వరలో అన్నం అనే సినిమా చేయబోతున్నాను. అన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాను” అని అన్నారు.