Aishwarya Rajesh: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హెల్ప్ చేయాలంటూ ఎలోన్ మస్క్‏కు వరుస ట్వీట్స్..

మార్చి 24న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌండ్ హ్యాక్ అయ్యంది. ఆమె ఖాతాలో అనుకోకుండా కొన్ని ట్వీట్స్ రీపోస్ట్ చేయబడ్డాయి. ఈ విషయాన్ని నెటిజన్లకు తెలియజేశారు ఆమె సోషల్ మీడియా ప్రచారకర్త యువరాజ్.

Aishwarya Rajesh: హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్.. హెల్ప్ చేయాలంటూ ఎలోన్ మస్క్‏కు వరుస ట్వీట్స్..
Aishwarya Rajesh
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 25, 2023 | 7:03 AM

దక్షిణాది చిత్రపరిశ్రమలో ఉన్న హీరోయిన్లలో ఐశ్వర్య రాజేష్ ఒకరు. నటన.. కంటెంట్ ప్రాధాన్యత ఉన్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. ఇటీవల రన్ బేబీ రన్ చిత్రంలో నటించింది ఐశ్వర్య. అయితే తాజాగా ఈ హీరోయిన్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందట. ఈ విషయాన్ని ఆమె ప్రచారకర్త యువరాజ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆమె ఖాతాను తిరిగి రికవరీ చేసేందుకు వెంటనే సహాయం చేయాలంటూ ఎలోన్ మాస్క్ కు యువరాజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్స్ వైరలవుతున్నాయి.

మార్చి 24న హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌండ్ హ్యాక్ అయ్యంది. ఆమె ఖాతాలో అనుకోకుండా కొన్ని ట్వీట్స్ రీపోస్ట్ చేయబడ్డాయి. ఈ విషయాన్ని నెటిజన్లకు తెలియజేశారు ఆమె సోషల్ మీడియా ప్రచారకర్త యువరాజ్. ఐశ్వర్య ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. సమస్యను పరిశీలిస్తున్నారని.. త్వరలోనే ఆమె ట్విట్టర్ అకౌంట్ తిరిగి పొందుతారని.. అప్పటివరకు అభిమానులు.. ఫాలోవర్స్ ఆమె ఖాతాలో షేర్ చేసే వాటిని పట్టించుకోవద్దని కోరారు.

ఇవి కూడా చదవండి

ఆ తర్వాత మరో ట్వీట్ లో ఎలోన్ మస్క్ ను ట్యాగ్ చేసి ఐశ్వర్య రాజేష్ ట్విట్టర్ అకౌంట్ తిరిగి పొందేందుకు తమకు సహాయం చేయాలని కోరారు. ప్రస్తుతం ఐశ్వర్య చేతిలో అరడజనుకు పైగా చిత్రాలున్నాయి. అజయంతే రండం మోషణం, మోహన్ దాస్, తీయవర్ కులైగల్ నడుంగ, పులిమాడ, ఆమె కథ, ఫర్హానా, తీరకాదల్, ధ్రువ నట్చతిరమ్ చిత్రాలున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.