Samantha: ‘తన ప్రేమలో ఆమెకు నమ్మకం ఉంది. కష్టాన్ని గౌరవంతో భరించింది’.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన సమంత..

ప్రస్తుతం సామ్ ముంబైలో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అందులో శాకుంతల పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సామ్.

Samantha: 'తన ప్రేమలో ఆమెకు నమ్మకం ఉంది. కష్టాన్ని గౌరవంతో భరించింది'.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన సమంత..
Samantha
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 23, 2023 | 8:14 AM

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా శాకుంతలం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో గౌతమి, ప్రకాష్ రాజ్, మోహన్ బాబు కీలకపాత్రలు పోషించగా.. మలయాళీ నటుడు దేవ్ మోహన్ హీరోగా కనిపించనున్నారు. తెలుగుతోపాటు.. తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్. ఇందులో భాగంగా ప్రస్తుతం సామ్ ముంబైలో సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఓ స్పెషల్ వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. అందులో శాకుంతల పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు సామ్.

“శకుంతల. ఆమెకు చాలా నమ్మకాలు ఉన్నాయి.. తన ప్రేమలో.. తన భక్తిలో ఎప్పుడూ నిజాయితీగానే ఉంటుంది. తన జీవితంలో ఎదురైన ఎన్నో కష్టాలను ఆమె దయ.. గౌరవంతో భరించింది. తనను భాదించిన అనేక సంఘటనలను నమ్మకంతో ఎదుర్కొంది. ఆమె యువరాణి. అడవి.. జంతువుల పాత్రలు నాలోని చిన్నపిల్లను గుర్తుచేసాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో శకుంతల పాత్ర పోషించినందుకు. ఈ సినిమాను ప్రేక్షకులు చూసి ఆదరిస్తారనే నమ్మకం నాకు ఉంది” అంటూ చెప్పుకొచ్చారు సామ్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుండగా.. శాకుంతలం సినిమా కోసం వెయిట్ చేస్తున్నామంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

నీలిమ గుణశేఖర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అదితి బాలన్.. అల్లు అర్హ, వర్ణిణి,కబిర్ సింగ్ దుహా కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ పౌరాణిక ప్రేమగాథలో ఒరిజినాలిటీ ఉండేందుకు ఒరిజినల్ నగలనే వాడారట చిత్రయూనిట్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!