Producer DVV Danayya: ఆర్ఆర్ఆర్ సినిమాకు చిరంజీవి పెట్టుబడులు ?.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దానయ్య.. అన్ని రూమర్స్ ను ఖండించారు. తాను కనిపించకపోయినా... తన పేరు వినిపిస్తే చాలనుకుంటానని.. వ్యక్తిగతంగా పబ్లిసిటీ అంటే నచ్చదని.. అందుకే ఆస్కార్ కు వెళ్లలేదని స్పష్టం చేసారు.

Producer DVV Danayya: ఆర్ఆర్ఆర్ సినిమాకు చిరంజీవి పెట్టుబడులు ?.. క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య..
Danayya
Follow us

|

Updated on: Mar 22, 2023 | 7:47 AM

దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవేదికగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నో అవార్డ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇటీవల ఆస్కార్ అవార్డ్స్ సైతం కైవసం చేసుకుని సెన్సెషన్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రూ. 400 కోట్లతో నిర్మించిన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ. 1200కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. అయితే ఇటీవల ఆస్కార్ అవార్డ్స్ వేడుకల కోసం అమెరికాలో సందడి చేసింది చిత్రయూనిట్. కానీ ఈ వేడుకల ప్రచారం కోసం జక్కన్న ఏకంగా రూ. 80 కోట్లు ఖర్చు చేశారని రూమర్స్ క్రియేట్ అయ్యాయి. అలాగే.. ఈ వేడుకలకు ప్రొడ్యూసర్ దానయ్య హజరుకాకపోవడంపై ఇటీవల పలు వదంతులు కూడా తెరపైకి వచ్చాయి. చిత్రబృందం ఆయన్ను పట్టించుకోవడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అంతేకాకుండా ట్రిపుల్ ఆర్ చిత్రంలో చిరంజీవి పెట్టుబడులు పెట్టారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దానయ్య.. అన్ని రూమర్స్ ను ఖండించారు. తాను కనిపించకపోయినా… తన పేరు వినిపిస్తే చాలనుకుంటానని.. వ్యక్తిగతంగా పబ్లిసిటీ అంటే నచ్చదని.. అందుకే ఆస్కార్ కు వెళ్లలేదని స్పష్టం చేసారు.

ట్రిపుల్ ఆర్ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి కొంత పెట్టుబడి పెట్టారంటూ వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. అవన్నీ రూమర్సేనంటూ తీవ్రంగా ఖండించారు. అలాంటి న్యూస్ ఎలా రాస్తారో అర్థంకాదన్నారు. తాను ఆ చిత్రాన్ని సుమారు రూ. 400 కోట్లు బడ్జెట్ పెట్టి నిర్మించానని.. ఫలితం విషయంలో మాత్రం చాలా సంతోషంగా ఉన్నానని అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా పెట్టుబడులకు .. చిరంజీవికి సంబంధం లేదన్నారు. తనకు చిరంజీవి కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయని.. చరణ్ బాబుతో.. కళ్యాణ్ బాబుతో మంచి సంబంధలున్నాయని.. వాళ్లంటే చాలా గౌరవముందని.. నేనంటే వాళ్లకు మంచి గౌరవం ఉందని. కావాలంటే సినిమా డేట్స్ ఇస్తారు కానీ.. డబ్బులిస్తారా ? అంటూ ప్రశ్నించారు.

రామ్ చరణ్ సినిమా షూటింగ్స్ వెళ్లడం చిరుకు అలవాటని.. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్ కు వచ్చారని అన్నారు. అలాగే ఆస్కార్ అవార్డ్ కోసం రూ. 80 కోట్లు ఖర్చు చేశారనే వార్తలపై స్పందిస్తూ.. అందుకు తాను ఎలాంటి ఖర్చు చేయలేదని.. రాజమౌళి ఖర్చు పెట్టారో లేదో తనకు తెలియదన్నారు. ఎక్కువమంది ప్రేక్షకులకు చేరేందుకు సినిమాను ఇక్కడ ప్రచారం చేసినట్టే రాజమౌళి అమెరికాలోనూ ప్రమోట్ చేశారని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.