Mrunal Thakur: ‘నిన్న చాలా కష్టంగా ఉంది.. కానీ ఇవాళ కాదు’.. మృణాల్ ఠాకూర్ కంటతడి.. అసలేం జరిగిందంటే ?..
తాజాగా తన ఇన్ స్టా వేదికగా కంటతడి పెట్టుకుంది. నిన్న చాలా కష్టంగా ఉంది.. కానీ ఇవాళ బలంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు.

తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. డైరెక్టర్ హను రాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. సహజ నటనతో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించాడు. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని సరసన నటిస్తోంది. అటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్గా ఉంటుంది మృణాల్. ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టా వేదికగా కంటతడి పెట్టుకుంది. నిన్న చాలా కష్టంగా ఉంది.. కానీ ఇవాళ బలంగా ఉన్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు.
“నిన్న చాలా కష్టంగా గడిచింది. కానీ ఈరోజు నేను మరింత బలంగా.. తెలివిగా.. చాలా సంతోషంగా ఉన్నాను. ప్రతి ఒక్కరి కథలలో ఇలాంటి పేజీలు ఉంటాయి. కానీ అందరూ బయటకు చెప్పారు. నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నేర్చుకున్న పాఠాన్ని ఎవరైనా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్కో రోజు అమాయకంగా బలహీనంగా ఉండడం మంచిది” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ క్రమంలోనే మృణాల్ ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
ఇటీవల బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ సరసన సెల్ఫీ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం గుమ్రా చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్ హీరోగా కనిపించనున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 7న రిలీజ్ కానుంది.





Mrunal
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




