AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాల నటి నుంచి గ్లామర్ క్వీన్ వరకు.. చిన్న ఛేంజ్‌తో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న యంగ్ హీరోయిన్‌

ఆమె ముఖంలో ఒక అమాయకత్వం కనిపిస్తుంది.. కానీ ఆమె కళ్లలో అంతులేని ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. బాల నటిగా వెండితెరపై అడుగుపెట్టి, తన బుజ్జి బుజ్జి మాటలతో అందరినీ ఆకట్టుకున్న ఆ చిన్నారి.. ఇప్పుడు టాలీవుడ్‌లో ఒక ప్రామిసింగ్ హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యింది.

బాల నటి నుంచి గ్లామర్ క్వీన్ వరకు.. చిన్న ఛేంజ్‌తో కుర్రాళ్ల గుండెల్లో గూడు కట్టుకున్న యంగ్ హీరోయిన్‌
Tollywood Young Heroine
Nikhil
|

Updated on: Feb 09, 2026 | 6:00 PM

Share

కేవలం నటనలోనే కాదు, ఫ్యాషన్ విషయంలోనూ ఆమె తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. సంప్రదాయాన్ని గౌరవిస్తూనే, ఆధునిక పోకడలను ఎలా మేళవించాలో ఆమెకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. ముఖ్యంగా ఆమె కళ్లు ఎంతటి మాయ చేస్తాయో మనందరికీ తెలుసు, కానీ ఆ కళ్ల అందం వెనుక ఒక రహస్యo ఉందన్న విషయం తాజాగా బయటపడింది. ఆ బాల నటి నుంచి నేటి గ్లామర్ తారగా మారిన ఆమె ఫ్యాషన్ ప్రయాణం, బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం..

కళ్ల అందం వెనుక మ్యాజిక్..

చాలామంది హీరోయిన్లు తమ కళ్లను హైలైట్ చేయడానికి బ్లాక్ కాజల్ ఉపయోగిస్తారు. కానీ సారా అర్జున్ మాత్రం ఇందుకు భిన్నమైన దారిని ఎంచుకుంది. నలుపు రంగు కంటే బ్రౌన్ కాజల్ తన సీక్రెట్ బ్యూటీ వెపన్ అని ఆమె వెల్లడించింది. బ్రౌన్ కాజల్ రాసి దాన్ని స్వల్పంగా స్మడ్జ్ చేయడం వల్ల కళ్లకు ఒక సాఫ్ట్, మేజికల్ లుక్ వస్తుందని ఆమె చెబుతోంది. ఈ చిన్న మార్పు ఆమె ముఖానికి ఒక విభిన్నమైన కళను ఇస్తోంది. మేకప్ విషయంలో అతిగా కాకుండా, ఇలాంటి చిన్న చిన్న ప్రయోగాలతోనే తన అందాన్ని రెట్టింపు చేసుకుంటుంది ఈ యంగ్ బ్యూటీ.

సారా అర్జున్ ఫ్యాషన్ గురించి మాట్లాడుతూ తాను ఎప్పుడూ ఒకే రకమైన దుస్తులకు పరిమితం కానని స్పష్టం చేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో ‘సేఫ్ గేమ్’ ఆడటం తనకు నచ్చదని, నిరంతరం కొత్త ప్రయోగాలు చేయడమే తనకిష్టమని తెలిపింది. ముఖ్యంగా సంప్రదాయ దుస్తులైన చీరలు, అనార్కలీలు వంటి క్లాసిక్ వేర్‌ను ఫ్యూచరిస్టిక్ ఔట్‌ఫిట్స్‌గా మలచుకోవడంలో ఆమె దిట్ట. మైథాలజీకి ఆధునిక టచ్ ఇచ్చే స్టయిల్‌ను ఆమె ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. దీనివల్ల ఆమె లుక్ పాతకాలపు అందాన్ని, నేటి కాలపు స్టయిల్‌ను ఒకేసారి ప్రతిబింబిస్తుంది.

Saara Arjunn

Saara Arjunn

చియాన్​ విక్రమ్​ నటించిన ‘నాన్న’ సినిమాలో చిన్నారిగా నటించిన సారా.. మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ లో చిన్ననాటి నందిని పాత్రతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇప్పుడు ‘యుఫోరియా’ సినిమాతో మెయిన్ లీడ్ గా అదృష్టాన్ని పరీక్షించుకుంది. సారా కేవలం గ్లామర్ మీద మాత్రమే కాకుండా, కథా బలమున్న పాత్రలనే ఎంచుకుంటోంది. తాజాగా రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ లోనూ ఆమె కీలక పాత్ర పోషించి బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. అటు యాక్షన్, ఇటు ఎమోషన్ రెండింటినీ పండించగల సత్తా తనలో ఉందని నిరూపించుకుంటోంది.

ఆత్మవిశ్వాసమే అసలైన గ్లామర్..

ఫ్యాషన్ అంటే కేవలం వేసుకునే దుస్తులు మాత్రమే కాదని, మనం ప్రదర్శించే ఆత్మవిశ్వాసమే అసలైన గ్లామర్ అని సారా నమ్ముతుంది. అందుకే ఏ రకమైన ఔట్‌ఫిట్ వేసినా అందులో తనదైన సౌకర్యాన్ని వెతుక్కుంటుంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న ‘మ్యాజిక్’ సినిమాలో కూడా ఆమె పాత్ర ఎంతో వైవిధ్యంగా ఉండబోతోందని సమాచారం. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను సారా సంపాదించుకుంది. సారా అర్జున్ బ్యూటీ ఫిలాసఫీ నేటి తరం యువతులకు ఒక కొత్త దారి చూపిస్తోంది. సంప్రదాయాన్ని విస్మరించకుండానే ఆధునిక ప్రపంచంలో ఎలా మెరవాలో ఆమె చూపిస్తున్న తీరు అద్భుతం.

Follow Us