Newsense Teaser: ఆహాలో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తికరంగా ‘న్యూసెన్స్’ టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

ఈ సిరీస్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Newsense Teaser: ఆహాలో మరో సస్పెన్స్ థ్రిల్లర్.. ఆసక్తికరంగా 'న్యూసెన్స్' టీజర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Newsense
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2023 | 6:52 AM

సూపర్ హిట్ చిత్రాలు.. సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్‎లతో సినీప్రియులను ఆకట్టుకుంటుంది ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా. అటు హిట్ సినిమాలే కాకుండా.. టాక్ షోలతో ఆన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తోన్న ఆహా.. ఈసారి మరో సస్పెన్స్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ తీసుకువస్తుంది. నవదీప్, బిందు మాధవి కీలకపాత్రలలో నటించిన లేటేస్ట్ వెబ్ సిరీస్ న్యూసెన్స్. దీనికి ప్రవీణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించగా.. ఇప్పటికే చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సిరీస్ టీజర్ రిలీజ్ చేశారు పాన్ ఇండియా స్టార్ రానా. ఈ టీజర్ చూస్తే పాలిటిక్స్, మీడియాను ఉద్ధేశించి తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. ఎవడు మాట విన్నా.. వినకపోయినా న్యూస్ రాసేవాడి చేతిలోనే ఉంటుంది చరిత్ర అంటూ నవదీప్ చెప్పే డైలాగ్ ఆసక్తిని పెంచుతోంది. అలాగే పాలిటిక్స్ ను ఆడించే పాళి.. మదనపల్లి రాజకీయాల్లో కథాకళి.. పవర్ పెన్ పాలిటిక్స్ అనే క్యాప్షన్ పై ఈ సిరీస్ ను తీసుకువస్తున్నారు త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ప్రకటించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.