AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్

జబర్దస్త్ లోకి నాగ బాబు రీఎంట్రీ ఇచ్చారు. జడ్జీగా కొనసాగుతున్నారు. అలాగే హైపర్ ఆది కూడా త్వరలోనే ఈ షోలోకి వస్తానని అతనే స్వయంగా వెల్లడించాడు. అయితే ఇప్పుడు ఆది కన్నా ముందే ఓ ఫేమస్ కమెడియన్ ఈ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. అతను ఎవరంటే?

Jabardasth: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. హైపర్ ఆది కన్నా ముందే జబర్దస్త్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన ఫేమస్ కమెడియన్
Jabardasth Vinod
Basha Shek
|

Updated on: May 27, 2026 | 1:12 PM

Share

జబర్దస్త్ కామెడీ షోకు పునర్వైభవం తీసుకురావడానికి మేనేజ్మెంట్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గతంలో ఇదే షోలో చేసి ఇప్పుడు సినిమాల్లో బిజీగా ఉంటోన్న వారిని మళ్లీ ఈ వేదికపైకి తీసుకు వస్తోంది. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు జబర్దస్త్ కు జడ్జీగా మళ్లీ బాధ్యతలు తీసుకున్నారు. ప్రారంభంలో ఆయన జస్ట్ గెస్ట్ గానే వస్తున్నారనుకున్నారు.. కేవలం ఒకటి, రెండు ఎపిసోడ్స్ కు మాత్రమే ఉంటారనుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన పర్మినెంట్ జడ్జీగా కొనసాగనున్నట్లు సమాచారం. నాగ బాబు తర్వాత స్టార్ కమెడియన్ హైపర్ ఆది కూడా జబర్దస్త్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు. జూన్ మొదటి వారం లేదా రెండో వారంలో కచ్చితంగా జబర్దస్త్ షోలోకి వస్తానని అతనే స్వయంగా వెల్లడించాడు. అయితే ఆది పర్మినెంట్ గా వస్తాడా? లేదా గెస్టుగా ఒకటి, రెండు ఎపిసోడ్స్ కే పరిమితం అవుతాడా? అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. అయితే హైపర్ ఆది కన్నా ముందే ఒక ఫేమస్ కమెడియన్ ఈ షోలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా విడుదలైన జబర్దస్త్ ప్రోమోలోనూఅతను కనిపించాడు. దీంతో అందరూ ఈ కమెడియన్ కు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇంతకీ అతడెవరనుకుంటున్నారా? వినోద్ అలియాస్ వినోదిని.

ఒకప్పుడు ఈ జబర్దస్త్ కామెడీ షోలో లేడీ గెటప్స్ తో బాగా పాపులర్ అయ్యాడు వినోద్. చీర కట్టి బొట్టు పెడితే అచ్చం అమ్మయిలాగే కనిపిస్తాడీ యాక్టర్. జబర్దస్త్ షోలో చాలా మంది అతనిని చూసి మొదట అమ్మాయే అనుకున్నారు కూడా. చమ్మక్ చంద్ర టీమ్ లో చేరిన వినోద్ తన కామెడీ, లేడీ గెటప్పులతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా చమ్మక్ చంద్ర, వినోద్ కాంబినేషన్ లో వచ్చిన స్కిట్స్ అయితే ఓ రేంజ్ లో పేలాయి. జబర్దస్త్ తో పాటు శ్రీదేవీ డ్రామా కంపెనీ తదితర టీవీ షోస్ లోనూ చేశాడు వినోద్. అయితే గత కొన్నేళ్లుగా జబర్దస్త్ తో పాటు బుల్లితెరకు కూడా పూర్తిగా దూరంగా ఉంటున్నాడు వినోద్.

ఇవి కూడా చదవండి

జబర్దస్త్ వినోద్ ఫొటోస్..

కాగా వినోద్ సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నాడు. ‘వినోద్ తో వినోదం’ పేరుతో ఆసక్తికరమైన వీడియోలు చేస్తూ బాగానే సంపాదిస్తున్నాడు. అలాగే బయట ఈవెంట్లు, షోస్ లు కూడా చేస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నట్లుండి సడెన్ గా జబర్దస్త్ షోలో ప్రత్యక్షమయ్యాడు వినోద్. రీసెంట్ గా రిలీజైన ప్రోమోలో లేడీ గెటప్పుతో ఆడియెన్స్ ను నవ్వించాడు. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. దీనిని చూసిన వారందరూ ‘ వెల్కమ్ బ్యాక్ వినోద్’ అంటూ అతనికి విషెస్ చెబుతున్నారు. మరి వినోద్ గెస్టు గానే వచ్చాడా? కేవలం ఒకటి, రెండు ఎపిసోడ్స్ కే పరిమితం అవుతాడా? లేదా పర్మినెంట్ గా కొనసాగుతాడా? అన్నది రాబోయే రోజుల్లో తెలవనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us