హైదరాబాద్ నా రెండో ఇల్లు.. భాగ్యశ్రీ బోర్సే మనసులో మాట
Rajitha Chanti
Pic credit - Instagram
21 Jun 2026
టాలీవుడ్‌లో గ్లామర్, నటనతో అలరిస్తున్న యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే చేసిన కామెంట్స్ గురించి ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది.
రవితేజ సరసన 'మిస్టర్ బచ్చన్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో భాగ్యశ్రీ మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం తన హృదయానికి ఎంతో దగ్గరైందని చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
అలాగే ఇక్కడ తనకు దొరుకుతున్న ఆదరణ చూస్తుంటే ఇది నా 'రెండవ ఇల్లు' అనిపిస్తోందని మనసులో మాటను బయటపెట్టింది భాగ్యశ్రీ బోర్సే.
సినిమా షూటింగ్స్ కోసం తరచుగా హైదరాబాద్ రావడం, ఇక్కడి ప్రజల ఆప్యాయత, వాతావరణం అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు.
బాలీవుడ్ నుండి వచ్చి ఇక్కడ స్థిరపడటం మొదట్లో ఒక సవాలుగా అనిపించినా, తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ప్రోత్సాహం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని ఆమె చెప్పారు.
తన తదుపరి ప్రాజెక్టుల కోసం ఎంతో కసరత్తు చేస్తోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు అవకాశం ఉన్న స్క్రిప్ట్‌లను ఎంచుకోవాలని భావిస్తోంది.
టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే హైదరాబాద్‌ను తన సొంత ఊరిలా భావిస్తూ, తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకోవడంలో సక్సెస్ అయ్యింది.