500 జీతం నుంచి కోట్ల వరకు.. సమంత ఆస్తులు ఎంతంటే..
Rajitha Chanti
Pic credit - Instagram
21 Jun 2026
సౌత్ ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు నటిగా మాత్రమే కాకుండా, వ్యాపారవేత్తగా, నిర్మాతగా దూసుకుపోతున్నారు.
సుమారు 16 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన విజయాలను అందుకున్న సమంత, నేడు ఇండస్ట్రీలో ఒక పవర్‌హౌస్‌గా నిలిచారు.
ఇటీవల ఆమె నటించి, స్వయంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' సినిమా విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. మరోసారి నటిగా ప్రశంసలు అందుకుంది.
సమంత ఆస్తుల విలువకు సంబంధించిన వివరాలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 2026 నాటికి సమంత నికర ఆస్తుల విలువ రూ.125 కోట్లు అని టాక్.
ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు లేదా ప్రాజెక్టుకు రూ. 3 కోట్ల నుండి రూ. 5 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
కేవలం సినిమాలే కాకుండా 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వంటి వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ ద్వారా సామ్ పాన్-ఇండియా రేంజ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు సమంత ఆదాయానికి ప్రధాన వనరుగా మారాయి. అగ్రశ్రేణి బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తుంది.
పోర్షే కేమాన్ జీటీఎస్, లగ్జరీ రేంజ్ రోవర్, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ జి63 ఏఎంజీ వంటి ఖరీదైన కార్లు సమంత గ్యారేజీలో ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్