AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం.. ఆమె చేయాల్సిన సినిమా నేను చేశా..

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్ గా రాణించారు సౌందర్య. అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు ఈ అగ్ర తార. ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో పాటు ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి ఆకట్టుకున్న సౌందర్య చిన్నవయసులో కన్నుమూయడం ఇండస్ట్రీని విషాదంలో ముంచెత్తింది.

నా భర్తకు సౌందర్య అంటే చాలా ఇష్టం.. ఆమె చేయాల్సిన సినిమా నేను చేశా..
Actress Kushboo
Rajeev Rayala
|

Updated on: May 27, 2026 | 1:15 PM

Share

ఇప్పుడంటే సినిమాలు తగ్గించారు కానీ అప్పటిలో హీరోయిన్ కుష్బూ క్రేజ్ వేరే లెవెల్ లో ఉండేది. యూత్ ను ఆమె తెగ ఆకట్టుకుంది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు కుష్బూ.. ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నారు కుష్బూ.. కాగా ఓ ఓల్డ్ ఇంటర్వ్యూ లో ఆమె అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన భర్త సుందర్ సి తో పరిచయం, ప్రేమ, పెళ్లి ప్రయాణంతో పాటు, పిల్లల పెంపకం, సినీ కెరీర్, రాజకీయ రంగ ప్రవేశం గురించి అనేక విషయాలను పంచుకున్నారు. సుందర్ సి దర్శకత్వం వహించిన మొదటి చిత్రం మురై మామన్లో హీరోయిన్‌గా తను మూడో ఛాయిస్‌నని కుష్బూ తెలిపారు. మొదట సౌందర్యను హీరోయిన్ గా అనుకున్నారట..కానీ  ఆయన తొలి సినిమాకాబట్టి ఆమె చేస్తారో లేదో అని.., తర్వాత మీనాను సెలక్ట్ చేశారు.. కానీ డేట్స్ అడ్జెస్ట్ అవ్వకపోవడంతో నాకు ఆ అవకాశం వచ్చిందని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి : సిల్క్ స్మితా నన్ను కాలితో తన్నింది.. సెట్‌లోనే ఏడ్చేశా.. షాకింగ్ విషయం చెప్పిన నటి

షూటింగ్ సమయంలో వారిద్దరూ స్నేహితులుగా మొదలై, మెల్లమెల్లగా ఒకరిపై ఒకరు ప్రేమను పెంచుకున్నాం అని వివరించారు. సుందర్ సి తనను నేరుగా పెళ్లి చేసుకుంటావా.? అని అడగకుండా, “నీకు, నాకు పిల్లలు పుడితే ఎలా ఉంటారు. నీలాగా.? లేక నా లాగానా.?” అని అడిగారని, అది విని తాను ఆశ్చర్యపోయానని కుష్బూ చిరునవ్వుతో గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాతే ఆయన “నన్ను పెళ్లి చేసుకుంటావా?” అని అడిగారని, క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే అవును చెప్పానని తెలిపారు. ఈ విషయంపై సుందర్ సి ఇప్పటికీ, “ఒక్క క్షణం ఆగమని చెప్పి ఉంటే స్వేచ్ఛగా బతికేవాడిని కదా” అని ఆటపట్టిస్తుంటారు అని సరదాగా కుష్బూ చెప్పారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి:Roja : స్టార్ హీరోల్లో ఆయన నాకు చాలా క్లోజ్.. భలే సరదా మనిషి .. చాలా మంచివారు

కుష్బూ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవంతిక తనను పోలి ఉంటుందని, కానీ స్వభావం, కళ్ళు, నుదురు తండ్రి సుందర్ సి లాగే ఉంటాయని అన్నారు. అవంతిక ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుందని, పుస్తకాలు చదవడానికి ఆసక్తి చూపిస్తుందని తెలిపారు. చిన్న కుమార్తె సుందర్ సికి అచ్చం జిరాక్స్ కాపీ అని, ఇంట్లో అందరూ తనను, చిన్నపాపను ఒక చోట కూర్చోనివ్వని అల్లరి పిల్లలని అంటుంటారని సరదాగా వివరించారు. తన ఇద్దరు కుమార్తెలు తండ్రిలాగే పొడవుగా పెరిగారని కుటుంబంలో తానే అందరికంటే పొట్టిగా ఉన్నానని నవ్వుతూ పేర్కొన్నారు. జీవితంలో ఎత్తుపల్లాలు ఉండాలని, అవే మనకు పాఠాలు నేర్పుతాయని కుష్బూ అభిప్రాయపడ్డారు. తప్పులు చేయడానికి భయపడకూడదని, తప్పులు చేయడం ద్వారానే మనం నేర్చుకుంటామని తన కుమార్తెలకు కూడా ఇదే చెబుతానని అన్నారు.

ఇది కూడా చదవండి:తిరుగులేని హీరోయిన్.. స్వామిజీ చెప్పాడని పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై.. ఇప్పుడు ఇలా

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us