తిరిగి ట్రాక్ లోకి  వచ్చిన కీర్తిసురేష్.. టాలీవుడ్‌లో బిజీకానున్న  బ్యూటీ

27 June 2026

Pic credit - Instagram

Rajeev 

మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది అందాల భామ కీర్తిసురేష్. 

నటి మేనకల కుమార్తె కీర్తి సురేష్. మేనక ఒకప్పుడు హీరోయిన్ గా రాణించారు. ఇక కీర్తి 2000 మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది. 

2013లో విడుదలైన మలయాళ సినిమా గీతాంజలితో హీరోయిన్ గా పరిచయమయింది. ఆ తరువాత, ఆమె తమిళ, తెలుగు చిత్రాలు చేస్తూ మెప్పిస్తుంది. 

తెలుగులో స్టార్ హీరోలతో కలిసి నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాల స్పీడ్ తగ్గించేసింది కీర్తిసురేష్. 

కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడు ఆంటోనీ తాటిల్‌ను 2024 డిసెంబరు 12న గోవాలోని ఓ ప్రైవేట్‌ రిసార్ట్‌లో పెళ్లి చేసుకుంది.

ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది కీర్తిసురేష్. కాగా ఈ మధ్యకాలంలో ఆమె నటించిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

బాలీవుడ్ లో చేసిన ఏకైక సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం అనిల్ రావిపూడి వెంకటేష్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.