మహేష్ బాబుకు నచ్చిన మలయాళీ హీరోయిన్.. ఇప్పుడు తెలుగులోకి..

Rajitha Chanti

Pic credit - Instagram

26 Jun 2026

టాలీవుడ్‌లోకి మరో మలయాళ ముద్దుగుమ్మ అడుగుపెడుతోంది. ప్రస్తుతం ఆ హీరోయిన్ గురించి అటు సోషల్ మీడియా, ఇటు ఫిల్మ్ వర్గాల్లో తెగ చర్చ నడుస్తుంది.

వైవిధ్యభరితమైన పాత్రలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్యదేవ్ ఇప్పుడు నటిస్తున్న తాజా చిత్రం ‘రావు బహదూర్’.

ఈ పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్‌గా నటిస్తూ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతోంది కేరళ కుట్టి దీపా థామస్. ఈ చిత్రాన్ని మహేష్ బాబు నిర్మిస్తున్నారు. 

ఇటీవలే ‘రావు బహదూర్’ సినిమాను చూసిన మహేష్ బాబు, ఈ చిత్రంపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. 

సినిమా చాలా అద్భుతంగా వచ్చిందని కొనియాడారు. ఇదే క్రమంలో సినిమాలో హీరోయిన్‌గా నటించిన దీపా థామస్ పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 

దీపా ఈ చిత్రంలో చాలా అందంగా కనిపించడమే కాకుండా, తన నటనతో ఎంతో అద్భుతంగా ఆకట్టుకుందని మహేష్ ప్రశంసించారు. దీంతో ఇప్పుడు ఆమె పేరు మారుమోగుతుంది.

ఒక స్టార్ హీరో నుండి ఇలాంటి కాంప్లిమెంట్స్ రావడంతో ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వైపు అందరి దృష్టి మళ్లింది. దీపా థామస్ మలయాళంలో ఇప్పటికే పలు చిత్రాల్లో నటించింది.

ముఖ్యంగా అక్కడ మంచి విజయం సాధించిన 'హోమ్', 'మోహన్ కుమార్ ఫ్యాన్స్', 'పెరుమాని', 'వైరస్' వంటి సినిమాల్లో కీలక పాత్రలు పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.