AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీల్లోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీస్.. లిస్టు ఇదిగో..!

ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీల్లో సందడి చేసేందుకు బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చేశాయ్. ఉగాది పండుగను పురస్కరించుకుని..

OTT Movies: ఓటీటీల్లోకి వచ్చేసిన బ్లాక్‌బస్టర్ మూవీస్.. లిస్టు ఇదిగో..!
Ott Movies
Ravi Kiran
|

Updated on: Mar 22, 2023 | 8:50 AM

Share

ప్రతీ వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీల్లో సందడి చేసేందుకు బ్లాక్‌బస్టర్ మూవీస్ వచ్చేశాయ్. ఉగాది పండుగను పురస్కరించుకుని ఇవాళ(మార్చి 22) మూడు సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలలోకి రిలీజ్ అయ్యాయి. మరి అవేంటో చూసేద్దామా..

పఠాన్:

బాలీవుడ్‌ బాద్షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన పఠాన్‌ సినిమా ఎంతటి అద్భుత విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా ఏళ్లుగా సరైన హిట్ లేక సతమతమవుతోన్న షారుఖ్‌కు బాక్సాఫీస్ దగ్గర బంపర్ బొనంజాను అందించింది ఈ సినిమా. సిద్దార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా జనవరి 25వ తేదీన విడుదలై.. ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టింది. కేవలం హిందీలోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లోనూ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుందీ సినిమా. ఇక ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేసేందుకు వచ్చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మార్చి 22 నుంచి తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.

వినరో భాగ్యము విష్ణుకథ:

కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశీ హీరోహీరోయిన్లుగా జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తెరకెక్కిన చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. వసూళ్ల పరంగా డీసెంట్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీల్లోకి వచ్చేసింది. మార్చి 22 నుంచి అటు ‘ఆహా’.. ఇటు ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది.

పంచతంత్రం:

బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘పంచతంత్రం’. ది వీకెండ్ షో స‌మ‌ర్పణ‌లో టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజిన‌ల్స్ బ్యాన‌ర్స్‌పై హ‌ర్ష పులిపాక ద‌ర్శక‌త్వంలో అఖిలేష్ వ‌ర్ధన్‌, స్రుజ‌న్ ఎర‌బోలు ఈ సినిమాను నిర్మించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 9న థియేట‌ర్స్‌లో విడుద‌లైన ఈ చిత్రం.. విమ‌ర్శకుల ప్రశంస‌లు అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీని మార్చి 22 నుంచి ఈటీవీ విన్ యాప్‌లో చూడొచ్చు.

Follow Us
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
బాల్కనీ, కిటికీ దగ్గరే పాలకూర పెంచేయొచ్చు.. ఇలా చేయండి!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
56 ఏళ్ల వయసులోనూ మెరిసే చర్మం.. ఖుష్బూ బ్యూటీ సీక్రెట్ ఇదే!
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
6వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించే కేంద్రం ప్రారంభం
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
72 ఏళ్ల వయసులో కార్లు, ట్రక్కులు నడుపుతున్న బామ్మ..వీడియోలు వైరల్
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
రూ.10 వేలతో బిజినెస్ స్టార్ట్ చేయండి..ఆదాయం ఇచ్చే 5 వ్యాపారాలు!
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
సూది దారం లేకుండానే ఆకులను కుట్టే పిట్ట..
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్
అప్పుడు ఆ హీరోయిన్‌ను చంపేయాలనిపించింది.. అనుపమ కామెంట్స్ వైరల్