Anasuya Bharadwaj : వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. ‘రంగమార్తాండ’ ప్రెస్‏మీట్‏లో అను ఆసక్తికర కామెంట్స్..

ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్‏మీట్‏లో యాంకర్ అనసూయ ఎమోషనల్ అయ్యారు. వేదికలపై ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా మాట్లాడే ఈ స్టార్ యాంకర్ ఈసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.

Anasuya Bharadwaj : వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్న అనసూయ.. 'రంగమార్తాండ' ప్రెస్‏మీట్‏లో అను ఆసక్తికర కామెంట్స్..
Anasuya
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 22, 2023 | 6:35 AM

సీనియర్ నటి రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం రంగమార్తాండ. ఇందులో శివాత్మిక రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ భరద్వాజ్ కీలకపాత్రలలో నటించగా.. ఇళయారాజా సంగీతం అందించారు.ఈ చిత్రం ఉగాది కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రిమియర్స్ షోస్ చూసిన సినీ ప్రముఖులు ఈ సినిమాపై పాజిటివ్ రివ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల నిర్వహించిన ప్రెస్‏మీట్‏లో యాంకర్ అనసూయ ఎమోషనల్ అయ్యారు. వేదికలపై ఎప్పుడూ నవ్వుతూ చలాకీగా మాట్లాడే ఈ స్టార్ యాంకర్ ఈసారి కన్నీళ్లు పెట్టుకున్నారు.

రంగమార్తాండ ప్రెస్‏మీట్‏లో పాల్గొన్న అనసూయ కృష్ణవంశీ వైపు తిరిగి ఆయనకు రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. “నాకు చాలా ఎమోషనల్ గా ఉంది. మళ్లీ నటిస్తున్నానని అనుకుంటారు. ” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అ భావోద్వేగంతో వచ్చిన కన్నీళ్లు.. వణుకుతున్న గొంతుతోనే మాట్లాడారు అనసూయ. “రంగమార్తాండ అనే సినిమాలో నేను ఉన్నాను. నా జీవితానికి ఇది చాలు. నిన్న రాత్రి నేను ఈ సినిమాను మొదటి సారి చూశాను. నా డబ్బింగ్ వరకు మాత్రమే సినిమా గురించి నాకు తెలుసు. సినిమా మొత్తం ఎప్పుడూ చూద్దామా అని ఎదురుచూశాను. ఊళ్లో లేకపోవడం వల్ల ఇప్పటివరకు చూడలేదు. మూడు రోజుల నుంచి కృష్ణవంశీ గారు నెక్ట్స్ షో ఎప్పుడూ అని తలతిన్న తర్వాత నిన్న చూశాను. ఆ సినిమాలోనే ఉండిపోయాను. ఇది నటసామ్రాట్ అనే సినిమా. దానిలో ఆల్ రెడీ ఏడ్చాను. మళ్లీ ఏడుపోస్తుంది. ధైర్యంగా. చాలా పొగరుగా వెళ్లి కూర్చున్నాను. కానీ ఒక సినీ ప్రేమికురాలిగా నేను ఎమోషనల్ కాకుండా ఉండలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చారు అనసూయ.

ఏ జన్మలోనే చేసుకున్న పుణ్యం వల్ల రంగమార్తాండ చిత్రంలో నటించగలిగానని అన్నారు. తెరమీద, బయట రంగమార్తాండ టీంతో కడిపిన క్షణాలు జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.