Keerthy Suresh: ‘ఆ సినిమా చేసినందుకు కొందరు నన్ను ట్రోల్ చేశారు’.. కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు..
నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల రూపొందిస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే తన ఫిల్మ్ కెరియర్.. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కీర్తి సురేష్.
నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత మహానటి సినిమాతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. అలనాటి హీరోయిన్ సావిత్రి జీవితకథగా వచ్చిన ఈ చిత్రంలో మహానటి సావిత్రి పాత్రలో కీర్తి అద్భుతంగా నటించింది. తన నటనతో సావిత్రినే మరిపించి ఆడియన్స్ హృదయాల్లో మహానటిగా పేరు సంపాదించుకుంది. ఆ తర్వాత ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్రకథానాయికగా వరుస హిట్లతో సక్సెస్ ఫుల్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె న్యాచురల్ స్టార్ నాని సరసన దసరా చిత్రంలో నటిస్తోంది. నూతన దర్శకుడు శ్రీకాంత్ ఒదెల రూపొందిస్తోన్న ఈ చిత్రం మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే తన ఫిల్మ్ కెరియర్.. సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోల్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కీర్తి సురేష్.
ఇటీవల ఓ ఇంటర్వ్యలో పాల్గొన్న కీర్తి.. మహానటి చిత్రాన్ని ఓకే చేసినందుకు తనను కొందరు ట్రోల్ చేశారని.. ఆ సినిమా పూర్తయ్యాకే ఈ విషయం తనకు తెలిసిందన్నారు. తనపై వచ్చిన విమర్శలు పక్కనపెడితే సావిత్రమ్మ పాత్రలో నటించినందుకు చాలా గర్వంగా ఉందన్నారు కీర్తి. “మహానటి చిత్రంలో నటించేందుకు ముందుగా ఒప్పుకోలేదు. సావిత్రమ్మ పాత్రలో నటించేందుకు చాలా భయమేసింది. కానీ దర్శకుడు నాగ్ అశ్విన్ నన్ను ప్రోత్సహించారు. నువ్వు చేయగలవు అనే ధైర్యనిచ్చారాయన. ఆయనకే అంత నమ్మకం ఉంటే.. నేను ఎందుకు భయపడాలి అనుకున్నాను. అలాగే మహానటి పూర్తిచేశా. ఆ పాత్రలో నటిస్తు్న్నందుకు కొంత మంది నన్ను ట్రోల్ చేశారు. ఆ విషయం నాకు తెలియదు. ఆ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు దీనిపై ప్రశ్న ఎదురైంది. అప్పుడు తెలిసింది నాపై ట్రోల్స్ వచ్చాయని.
సోషల్ మీడియాలో నాపై వచ్చే నెగెటివిటీపై పెద్దగా ఆసక్తి చూపను. అందుకే నాపై ట్రోల్స్, విమర్శలు రావు. సావిత్రమ్మకు బయోపిక్ లో నటించడం భయంగా అనిపించింది. ఆమె కుమార్తెతో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఎన్నో సవాళ్లు ఎదురైనా కూడా ఆ పాత్ర చేసినందుకు మాత్రం గర్వపడుతున్నాను” అంటూ చెప్పుకొచ్చారు కీర్తి సురేష్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.