AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలర్ ఫోటోను మూవీని చేతులారా మిస్ చేసుకున్నా.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..

కలర్ ఫోటో ఎంత మంచి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆకట్టుకునే కథతో తెరకెక్కిన ఈ మూవీ మంచి విజయం అందుకోవడంతో పాటు నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ సినిమాలో సుహాస్, చాందినీ తమ నటనతో ఆకట్టుకున్నారు.

కలర్ ఫోటోను మూవీని చేతులారా మిస్ చేసుకున్నా.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నా..
Colour Photo
Rajeev Rayala
|

Updated on: Feb 27, 2025 | 10:36 AM

Share

టాలీవుడ్ యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన కలర్ ఫోటో సినిమా మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా కట్టుకుంది. అమృతా ప్రొడక్షన్స్, లౌక్యా ఎంటర్టైన్మెంట్ పతాకాలపై సాయి రాజేష్, బెన్ని ముప్పానేని నిర్మించిన ఈ చిత్రానికి సందీప్ రాజ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా చాందినీ చౌదరీ హీరోయిన్ గా నటించింది. సుహాస్ తొలిసారిగా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో చాందిని చౌదరితో పాటు సునీల్, వైవా హర్ష, ‘కంచరపాలెం’ ఫెమ్ సుబ్బారావు తదితరులు నటించారు. 1990లలో మచిలిపట్నం నేపథ్యంలో, ఒక సాధారణ యువకుడి జీవిత కథతో ఈ సినిమా రూపొందించబడింది. ఈ సినిమాలో సుహాస్ తో సహా అందరూ అద్భుతంగా నటించి మెప్పించారు.

అయితే ఈ సూపర్ హిట్ సినిమాను చేతులారా మిస్ చేసుకున్నా అని ఓ హీరోయిన్ తెలిపింది. కలర్ ఫోటో సినిమాను మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా అని తెలిపింది ఆ బ్యూటీ. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగు అమ్మాయి అయినా ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోతున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రియా వడ్లమాని. ప్రియా వడ్లమాని. 2018లో వచ్చిన ప్రేమకు రెయిన్ చెక్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత శుభలేఖలు, హుషారు చిత్రాల్లో నటించింది.

ఇవి కూడా చదవండి

అయితే హుషారు సినిమాతో ఈ బ్యూటీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. ఒక్క సినిమాతోనే చాలా మంది ఫెవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. కానీ తెలుగులో ఆశించినంత ఆఫర్స్ అందుకోలేకపోయింది. ఇప్పుడు వరుసగా సినిమా ఛాన్స్ లు అందుకుంటుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది ప్రియా. ఆమె మాట్లాడుతూ.. ఫేస్‌బుక్‌ లో నా ఫొటోస్ చూసి నాకు సినిమా ఆఫర్‌ వచ్చింది.  2015లో నా సినిమా జర్నీ మొదలైంది. కెరీర్ బిగినింగ్ లో నాకు కలర్ ఫోటో ఆఫర్ వచ్చింది. కానీ నేను ఆ సినిమాను మిస్ చేసుకున్నా..  అప్పట్లో నాకు సరిగ్గా గైడ్ చేసేవారు లేరు. నేను సినిమా ఫిలిం బ్యాగ్రౌండ్ నుంచి రాలేదు. నేను సినిమా ఓకే చేయాలంటే నేను,అమ్మ, నాన్న ముగ్గురం కలిసి నిర్ణయం తీసుకోవాలి. కలర్ ఫోటో ఆఫర్ వచ్చినప్పుడు నాకు సమయం కావాలి అని చెప్పాను. అలాగే పల్లెటూరి అమ్మాయి పాత్రకు నేను సెట్ కాను అని వాళ్ళు ఫీల్ అయ్యారు. అలా కలర్ ఫోటో సినిమా మిస్ అయ్యాను అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ప్రభాస్ లేకపోతే చనిపోయేవాడిని.. చత్రపతి శేఖర్ ఎమోషనల్..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..