AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాలుగు సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. కట్ చేస్తే ఛాన్స్ లు రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్

సినిమా ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ సహజం.. హీరోలు వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంటారు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంటారు. కానీ సినిమాలు ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోయిన్, దర్శకుడి కెరీర్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ హీరోయిన్ కూడా ఫ్లాప్స్ పడటంతో ఇండస్ట్రీకి దూరం అయ్యింది.

నాలుగు సినిమాలు చేస్తే ఒకేఒక్క హిట్.. కట్ చేస్తే ఛాన్స్ లు రావడం లేదంటూ కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 26, 2025 | 9:59 AM

Share

హీరోయిన్ గా రాణించాలి. మంచి ఫెమ్ తెచ్చుకోవాలి.. స్టార్ హీరోల సినిమాల్లో నటించాలి అని చాలా మంది ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. అయితే అందరికి అదృష్టం కలిసి రాక కనుమరుగైన హీరోయిన్ చాలా మంది ఉన్నారు. అందం అభినయం ఉన్న కూడా చాలా మంది హీరోయిన్స్ అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు. కొంతమంది సినిమాలు మానేసి బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. మరికొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అవుతున్నారు. అయితే ఓ యంగ్ హీరోయిన్ మాత్రం అదృష్టం కలిసి రాక అవకాశాల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంది. అంతే కాదు తనకు అవకాశాలు ఇవ్వాలని కన్నీళ్లు కూడా పెట్టుకుంది ఆమె.. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?

ఈ బ్యూటీ చేసింది తెలుగులో నాలుగు సినిమాలే.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కొన్ని సినిమాల్లో తన అందంతో ప్రేక్షకులను కవ్వించింది. కానీ చేసిన సినిమాల్లో మొదటి సినిమా తప్ప మిగిలినవి అన్ని ఫ్లాప్ అయ్యాయి. దాంతో ఆమె తెలుగు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యింది. ఇంతరభాషల్లో సినిమాలు చేస్తుంది. కానీ అక్కడ కూడా స్టార్ గా ఎదగలేకపోయింది. ఆమె ఎవరో తెలుసా.?

ఇవి కూడా చదవండి

లవ్లీ సినిమా గుర్తుందా.? ఆది సాయి కుమార్ హీరోగా నటించిన ఈ సినిమాకు బీఏ జయ దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా  నటించింది శాన్వీ శ్రీవాస్తవ. తొలి సినిమాతోనే తన క్యూట్ పర్ఫామెన్స్ తో కవ్వించింది. ఆతర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి. సుశాంత్ అడ్డా, మంచు విష్ణు రౌడీ, మరోసారి ఆదితో ప్యార్ మే పడిపోయానే సినిమాల్లో నటించింది. కానీ అవేమి వర్కౌట్ కాలేదు. దాంతో కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళింది. అక్కడ కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆ మధ్య అతడే శ్రీమన్నారాయణ డబ్బింగ్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ సమయంలో శాన్వీ మాట్లాడుతూ తెలుగులో అవకాశాలు రావడం లేదు అని కన్నీళ్లు పెట్టుకుంది. తనకు ఎందుకు ఛాన్స్ లు రాలేదో అర్ధం కావడం లేదు అని స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఇప్పుడు కన్నడలోనే సినిమాలు చేస్తుంది. అక్కడ కూడా ప్రస్తుతం శాన్వీ శ్రీవాస్తవకు చెప్పుకోదగ్గ సినిమాలు రావడం లేదు.

శాన్వీ ఇన్  స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్