AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెస్ట్ ఫ్రెండ్ భర్తనే లవ్ చేసింది.. కట్ చేస్తే పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఇప్పుడు ఇలా

సినిమా ఇండస్ట్రీలో ఎఫైర్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. హీరోలు, హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ ఎప్పుడూ హాట్ టాపికే.. కొంతమంది హీరోయిన్స్ ఏకంగా ముగ్గురు నలుగురితో ఎఫైర్స్ పెట్టుకొని ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటారు. ఇప్పుడు ఓ హీరోయిన్ ఎఫైర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

బెస్ట్ ఫ్రెండ్ భర్తనే లవ్ చేసింది.. కట్ చేస్తే పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్.. ఇప్పుడు ఇలా
Actress
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2025 | 12:56 PM

Share

ఆ హీరోయిన్ ఈ హీరోతో ఎఫైర్ పెట్టుకుంది. ఆ హీరో ఈ హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నాడు. ఇవే వార్తలు నిత్యం ఫిలిం సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సినిమాలతో కంటే ఇలాంటి ఎఫర్స్ వార్తలతోనే చాలా మంది పాపులర్ అవుతూ ఉంటారు. కొంతమంది ఇద్దరు ముగ్గురితో ఎఫైర్స్ నడుపుతూ ఉంటారు. ఇక విడాకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఎఫైర్స్ ఎక్కువగా వార్తల్లో నిలిచారు. ఇక ఈ హీరోయిన్ ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ భర్తతోనే ఎఫైర్ పెట్టుకుంది. అంతే కాదు ఇద్దరు ముగ్గురు హీరోలతోనూ ఆమె ఎఫైర్స్ నడిపింది. అలాగే ఓ క్రికెటర్ తోనూ యవ్వారం నడిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

సినీ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ ఓ హాట్ టాపిక్. సినిమాలతో కంటే ఆమె ఎఫైర్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఓ  క్రికెటర్ తో డేటింగ్ చేసింది. అలాగే పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయ్యింది. అంతే కాదు బెస్ట్ ఫ్రెండ్ భర్త తోనే ఎఫైర్ నడిపింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఇండస్ట్రీలో ఎఫర్స్ చాలా కామన్ అయ్యాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో హీరో, హీరోయిన్స్ మధ్య ఎఫైర్స్ ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా బాలీవుడ్ బ్యూటీనే.. ఆమె పేరు అమృత అరోరా.

బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా సోదరి ఈ చిన్నది. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ , మోడల్, టీవీ ప్రజెంటర్, విజేగా చేసింది. బాలీవుడ్ సినిమాలు, సిరీస్ చేస్తూ పేక్షకులను అలరించింది. 2015వరకు అమృత ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంది.  2004లో అమృతా అరోరా పాకిస్థానీ సంతతికి చెందిన ఇంగ్లండ్ క్రికెటర్ ఉస్మాన్ అఫ్జల్‌తో రిలేషన్‌ నడిపింది. అప్పట్లో వీరి ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఉస్మాన్‌తో ప్రేమలో ఉన్నట్లు అమృత ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యింది కూడా.. ఆ తర్వాత అతనితో విడిపోయింది. ఆ తర్వాత షకీల్ లడక్‌ను పెళ్లి చేసుకుంది. అంతకు ముందే అతనికి పెళ్లి అయ్యింది. షకీల్ లడక్ మొదటి భార్య అమృతకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె పేరు నిషా. ఇలా ఫ్రెండ్ భర్తతోనే లవ్ ఎఫైర్ పెట్టుకుంది. అంతే కాదు పెళ్ళికి ముందే ప్రగ్నెంట్ అయ్యింది. ఇక ఇప్పుడు షకీల్ లడక్ తో కలిసి ఉంటుంది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Amrutha

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us