ఇంత అందమైన అమ్మాయి నీకు అవసరమా అని హేళన చేశారు..: నిర్మత రవీందర్
కోలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులకు మహాలక్ష్మి సుపరిచితమే. ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‌ను ఆమె వివాహం చేసుకోవడం సౌత్ ఇండియాలో ఆమె పేరు మారుమోగింది. అప్పటికే భర్తతో విడాకులు తీసుకున్న ఆమె.. నిర్మాత రవీందర్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశగా మారింది.

మహాలక్ష్మి, రవీందర్ చంద్రశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ లో ఈ ఇద్దరూ చాలా పాపులర్. పలు సీరియల్స్ ద్వారా చాలా పాపులర్ అయ్యారు మహాలక్ష్మి. మహాలక్ష్మి సుపరిచితమే. ప్రముఖ నిర్మాత రవీందర్ చంద్రశేఖర్‌ను ఆమె వివాహం చేసుకోవడం సౌత్ ఇండియాలో ఆమె పేరు మారుమోగింది. ఈ జంట గురించి చాలా మంది మాట్లాడుకున్నారు. అయితే మహాలక్ష్మీకి ఇది రెండో పెళ్లి. అంతకు ముందే ఆమెకు పెళ్ళై భర్తకు విడాకులు ఇచ్చింది. వీరిద్దరి వివాహం అప్పట్లో ఇండస్ట్రీలో చర్చనీయాంశగా మారింది. ఇక వీరి పెళ్లి తర్వాత మహాలక్మీ జంటపై దారుణంగా ట్రోల్స్ వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా తన భర్తతో కలిసి ఫోటోస్, రీల్స్ షేర్ చేస్తూ సంతోషంగా గడుపుతుంది.
అయితే ఈ ఇద్దరూ విడిపోతున్నారని కూడా రకరకాల వార్తలు పుట్టుకొచ్చాయి. వీటి పై ఇద్దరూ ఎప్పుడూ స్పందించలేదు. రవీందర్ చంద్రశేఖర్ నిర్మాతగా పలు సినిమాలు చేశారు. అలాగే రవీందర్ చంద్రశేఖర్ తాజాగా డ్రాగన్ సినిమాలో నటించారు. ఈ సినిమా తో ఆయనకు మరోసారి క్రేజ్ వచ్చింది. కాగా రవీందర్ చంద్రశేఖర్ రీసెంట్ గా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా మహాలక్ష్మీ, రవీందర్ చంద్రశేఖర్ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
రవీందర్ మాట్లాడుతూ.. తనకు పెళ్లి అయిన తర్వాత చాలామంది హేళన చేశారని ఎమోషనల్ అయ్యారు. ఇంత అందమైన అమ్మాయితో పెళ్లి ఏంటి.? అంటూ కొందరు మెసేజ్‌లు కూడా చేశారని చెప్పుకొచ్చాడు. నేను మహాలక్ష్మీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత చాలా మంది విమర్శలు చేశారు. అంత అందమైన అమ్మాయి ఇతన్ని పెళ్లిచేసుకుందేంటి.? అయినా ఈ పెళ్లి ఎన్నిరోజులు ఉంటుందో చూద్దాం.!, అని విమర్శలు చేశారు. కొంతమంది మేము విడిపోయాము అని కూడా ప్రచారం చేశారు అని ఆవేదన వ్యక్తం చేశాడు.
View this post on Instagram
మహాలక్ష్మీ, రవీందర్ ..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




