AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prabhas: ప్రభాస్‌ బిహేవియర్ చూసి షాక్ అయ్యాను.. స్టార్ హీరోయిన్ కామెంట్స్

సలార్, కల్కి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ సొంతం చేసుకున్నాడు పాన్ ఇండియా స్టార్ నటుడు ప్రభాస్. ప్రస్తుతం ఈ స్టార్ హీరో చేతిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలున్నాయి. కాగా కొవిడ్‌కి ముందు ఏడాదిలో ప్రభాస్ ఒక్క సినిమా మాత్రమే రిలీజయ్యేది. అయితే 2023లో ఆ రూల్ ని బ్రేక్ చేశాడు ప్రభాస్.

Prabhas: ప్రభాస్‌ బిహేవియర్ చూసి షాక్ అయ్యాను.. స్టార్ హీరోయిన్ కామెంట్స్
Prabhas
Rajeev Rayala
|

Updated on: Feb 27, 2025 | 8:34 AM

Share

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ప్రభాస్ రెండు బడా సినిమాలతో ఫుల్ ఖుష్ లో ఉన్నాడు. దాదాపు ఆరేళ్ళ తర్వాత ప్రభాస్ సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సలార్ సినిమాసక్సెస్ ను ఫ్యాన్ ఎంజాయ్ చేసే లోగా కల్కి సినిమాను దింపాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన కల్కి సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఈమూవీ ఏకంగా రూ. 1000కోట్లకు పైగా వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ లో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రాజా సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. హారర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే ఈ సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమా హారర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. అలాగే ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్ నటిస్తున్నారని తెలుస్తుంది.

ఇప్పటికే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది. ఇదిలా ఉంటే తాజాగా తమిళ్ బ్యూటీ మాళవిక ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది. ప్రభాస్ ను సెట్ లో చూసి ఆశ్చర్యపోయాను అని తెలిపింది. అంత పెద్ద పాన్ స్టార్ హీరో అయ్యుండి చాలా నార్మల్‌గా, సింపుల్‌గా, సపోర్టివ్‌గా ఉంటాడు. షూటింగ్ సెట్లో ఉన్న అందరితో సరదాగా మాట్లాడుతాడు. టీమ్ మొత్తానికి మంచి ఫుడ్ తెప్పిస్తాడు, దగ్గర ఉండి బిర్యానీ వడ్డిస్తాడు.. ఇవన్ని చూసి నేను చాలా ఆశ్చర్యపోయానని తెలిపింది. ‘నిజంగా ప్రభాస్ చాలా స్వీట్’ అంటూ చెప్పుకొచ్చింది మాళవిక మోహనన్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?