- Telugu News Photo Gallery Cinema photos Pawan Kalyan's Hari Hara Veera Mallu Movie update on 26 02 2025
Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్‌ను కావాలనే కార్నర్ చేస్తున్నారా..?
ముందు నుంచి రిలీజ్ డేట్ చెప్తుంటే ఏదో చెప్తున్నారు గానీ వస్తారా ఏంటి అనుకుంటున్నారు గానీ సీన్ చూస్తుంటే నిజంగానే వచ్చేలా కనిపిస్తున్నారు. ఒకవేళ ఆయనొస్తే.. మిగిలిన హీరోలు సైడ్ ఇవ్వాలి కదా.. మరి వాళ్లంతా వస్తామని ఎందుకు చెప్తున్నారు..? మరి ఆయన రావట్లేదా..? సబ్ టైటిల్స్ లేని కొరియన్ డ్రామాలా ఏంటి అనుకుంటున్నారు కదా.. చూసేయండి ఎక్స్‌క్లూజివ్‌గా..
Updated on: Feb 27, 2025 | 10:59 PM

పైన మన యాంకర్ పార్ట్‌లో మాట్లాడుకున్న స్టోరీ అంతా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా గురించే. దర్శక నిర్మాతలమే మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో సినిమా విడుదల చేస్తామని కంకణం కట్టుకున్నారు. కానీ ఫ్యాన్స్ అయితే నమ్మట్లేదు ఈ మ్యాటర్. మరోవైపు పవన్ కూడా రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు.. అయినా కూడా వాళ్ళైతే తగ్గేదే లే అంటున్నారు.

మార్చి 28కి ఇంకా ఎన్నో రోజులు లేదు.. ఇంకా పవన్ డేట్స్ కావాల్సి ఉంది. ఎన్ని అడ్డంకులున్నా.. ఎలాగోలా డేట్స్ సంపాదించి సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేస్తామంటున్నారు మేకర్స్.

ఈ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నారు ఏఎం రత్నం. అయితే పవన్ వస్తున్నారని తెలిసినా.. నితిన్ సహా మరో రెండు సినిమాలు పోటీలో ఉన్నాయి.తెలిసి తెలిసి పవన్‌కు పోటీగా నితిన్ అయితే రారు.. పైగా అక్కడున్నది మైత్రి మూవీ మేకర్స్ కాబట్టి పవన్‌తో పోటీ పడే సాహసం చేయరు.

ఈ లెక్కన వీరమల్లు వస్తే రాబిన్ హుడ్ రాడు.. కానీ మార్చి 28న మా సినిమా పక్కా అంటున్నారంటే.. వీరమల్లు వస్తుందా రాదా అనే కన్ఫ్యూజన్ మళ్లీ మొదలవుతుంది. మరోవైపు మార్చి 27న లూసీఫర్ 2, వీరధీర శూరన్ సినిమాలు షెడ్యూల్ అయ్యాయి.

సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న మ్యాడ్ స్క్వేర్ మార్చి 29న విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ వస్తే నా సినిమా ఎలా రిలీజ్ చేస్తానని ఇదివరకే నిర్మాత నాగవంశీ చెప్పారు. మరి మార్చి 28న వీరమల్లు రాడా.. ఒకవేళ వస్తే తన సినిమాను వాయిదా వేసుకోవచ్చులే అనుకుంటున్నారా..? ఏదేమైనా వీరమల్లుపై చాలా సినిమాలైతే దండయాత్ర చేస్తున్నాయి.




