Varasudu: దళపతి ఫ్యాన్స్‌కు షాక్.. ఆ కారణంగానే ‘వారసుడు’ వెనకడుగు వేయనున్నాడా ?..
అజిత్ కుమార్..హెచ్ వినోద్ కాంబోలో రాబోతున్న తునీవు చిత్రం జనవరి 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటిస్తోన్న వారుసుడు చిత్రం కూడా ఇదే రోజున విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పుదనుకుంటున్నారు ఫ్యాన్స్.

సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద భారీ ప్రాజెక్ట్స్ పోటీపడనున్న సంగతి తెలిసిందే. అందులో ఇద్దరూ తెలుగు స్టార్ హీరోస్ కాగా..మరో ఇద్దరు తమిళ్ అగ్రకథానాయకులు. దీంతో ఈసారి థియేటర్లలో ఈ నలుగురు మధ్య పోటీ నెలకొంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీరసింహా రెడ్డి జనవరి 12న విడుదల కానుండగా.. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య జనవరి 13న రిలీజ్ కానుంది.ఇక మరోస్టార్ అజిత్ కుమార్..హెచ్ వినోద్ కాంబోలో రాబోతున్న తునీవు చిత్రం జనవరి 11న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. మరోవైపు తమిళ్ స్టార్ విజయ్ దళపతి నటిస్తోన్న వారుసుడు చిత్రం కూడా ఇదే రోజున విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ క్లాష్ తప్పుదనుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ క్రమంలో తాజాగా దళపతి సినిమా గురించి వస్తున్న వార్తలు అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పొంగల్ బరి నుంచి విజయ్ వెనకడుగు వేయనున్నాడని నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
డైరెక్టర్ వంశీ పైడిపల్లి.. విజయ్ దళపతి కాంబినేషన్లో రాబోతున్న వారసుడు మూవీ జనవరి 11న కాకుండా.. జనవరి 14న రిలీజ్ చేయాలని భావిస్తున్నారట మేకర్స్. ఇందుకు బలమైన కారణం కూడా ఉందట. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వర్క్స్ ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయట. దీంతో అనుకున్న సమయానికి సినిమాను రిలీజ్ చేయడం కష్టమని.. అందుకే విడుదల వాయిదా వేయాలని భావిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరీ ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీలో విజయ్ సరసన రష్మిక మందన్నా నటిస్తుండగా.. జయసుధ, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన అమ్మ, రంజితమే పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.




మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




