Tollywood: ఒక్క సినిమాకు రూ.30 కోట్లు రెమ్యునరేషన్.. స్టార్ హీరోలకు మించిన క్రేజ్.. ఫాలోయింగ్ చూస్తే మెంటలెక్కిపోద్ది..
కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరోయిన్. సౌత్ ఇండస్ట్రీలోని అత్యంత ఎక్కువ డిమాండ్ ఉన్న తారలలో ఆమె ఒకరు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్రేజీ బ్యూటీ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. అందులో తన తల్లి ఒడిలో ఉన్న కూర్చున్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. ఇంతకీ ఆమె ఎవరంటే..

సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. తల్లి ఒడిలో అమాయకంగా కూర్చున్న ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ హీరోయిన్. ఇండస్ట్రీలో ఇప్పుడు ఆమె క్రేజీ హీరోయిన్. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న హీరోయిన్లకు ఆమె చాలా విభిన్నం. కంటెంట్, పాత్ర ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ.. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ సహజ నటనతో కట్టిపడేస్తుంది. హీరో పాత్రతోపాటు తన పాత్రకు కూడా సరైన బలం ఉంటేనే సినిమాకు ఒప్పుకుంటుంది. అందుకే ఆమెకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో స్టార్ హీరోలకు మించిన క్రేజ్ సొంతం చేసుకుంది. అందుకే ఆమెను అభిమానులు లేడీ పవర్ స్టార్ అంటూ ముద్దుగా పిలిచుకుంటారు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో ఇప్పుడైనా గుర్తొచ్చిందా.. ? ఈ క్యూటీ మరెవరో కాదు.. టాలీవుడ్ మోస్ట్ క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి. ఆమె చిన్ననాటి ఫోటో ఇది.
సాయి పల్లవి.. ప్రేమమ్ సినిమాతో మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి చిత్రంతోనే ఊహించని క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. దీంతో తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమా ఆఫర్స్ అందుకుంటూ అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోలను మించి ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇటీవలే తండేల్ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తుండగా.. రాముడిగా రణభీర్ కపూర్ కనిపించనున్నారు. మూడు భాగాలుగా రానున్న ఈ సినిమా కోసం సాయి పల్లవి రూ.30 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుందని టాక్. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు తెలుగులోనూ మరిన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందట సాయి పల్లవి.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Tollywood: మరీ ఇంత క్యూట్‌గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‌కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..




