AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alekhya Chitti Pickels : తప్పు చేశాను.. క్షమించండి.. ఎట్టకేలకు సారీ చెప్పిన అలేఖ్య చిట్టి..

గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పచ్చళ్ల ధరలు గురించి అడిగినందుకు సదరు కస్టమర్ ను అసభ్యకరంగా బూతులు తిడుతూ రాయడానికి లేకుండా ఆడియో రిప్లై ఇచ్చింది అలేఖ్య చిట్టి. దీంతో ముగ్గురు అక్క చెల్లెళ్లపై మండిపడ్డారు నెటిజన్స్.

Alekhya Chitti Pickels : తప్పు చేశాను.. క్షమించండి.. ఎట్టకేలకు సారీ చెప్పిన అలేఖ్య చిట్టి..
Alekhya Chitti Pickles
Rajitha Chanti
|

Updated on: Apr 06, 2025 | 10:22 AM

Share

గత వారంలో రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియో మెసేజ్స్ హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెల్లు అలేఖ్య, సుమ, రమ్య కంచర్ల నాన్ వెజ్ పచ్చళ్ల వ్యాపారంతో ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. అయితే పచ్చళ్ల రేట్స్ ఎక్కువగా ఉన్నాయని అడిగిన ఓ కస్టమర్ పై అసభ్యకరమైన.. రాయడానికి వీలు లేని పదాలతో బూతులు తిడుతూ రిప్లై ఇచ్చింది అలేఖ్య. దీంతో ఒళ్లుమండిన ఆ కస్టమర్ వీరి బూతు పురాణాన్ని నెట్టింట షేర్ చేయగా.. క్షణాల్లోనే తెగ వైరలయ్యింది. నెట్టింట బాయ్ కాట్ అలేఖ్య చిట్టి పికిల్స్ అంటూ ట్రోల్స్, విమర్శలు రావడంతో దెబ్బకు వెబ్ సైట్ క్లో్జ్ చేసి.. వాట్సాప్ డెలిట్ చేశారు అలేఖ్య సిస్టర్స్. అయినప్పటికీ ఈ వివాదం సద్ధుమణగలేదు. దీంతో ఈ ముగ్గురు అక్కచెల్లెల్లు సారీ చెబుతూ సంజాయిషీ ఇచ్చుకున్నారు.

ఇక ఈ వివాదానికి అసలు కారణమైన.. అదేనండి బూతులు తిడుతూ ఆడియో రిప్లై ఇచ్చిన అలేఖ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నెటిజన్స్ డిమాండ్ చేశారు. ఆమె సమాధానం చెప్పాల్సిందే అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేశారు. ఎట్టకేలకు ఇప్పుడు అలేఖ్య సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ చేసింది. అందులో అలేఖ్య చిట్టి మాట్లాడుతూ.. “నేను అలేఖ్య చిట్టిని మాట్లాడుతున్నాను. నేను తప్పు చేశాను. ఇప్పటివరకు నేను తిట్టిన వాళ్లందరికీ క్షమాపణలు చెబుతున్నాను” అంటూ ఓ వీడియో రిలీజ్ చేసింది. దీంతో ఈ వివాదానికి ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టాలని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తుండగా.. మరోసారి అలేఖ్య చిట్టి వీడియోను ట్రోల్ చేస్తున్నారు మరికొందరు నెటిజన్స్.

పచ్చళ్ల వ్యాపారం ద్వారా ఫేమస్ అయిన ఈ ముగ్గురు అక్క చెల్లెల్లు సారీ చెబుతూ వీడియోస్ షేర్ చేయడంతో ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. ఒక్క ఆడియో దెబ్బకు బంద్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యాపారం మళ్లీ స్టార్ట్ అవుతుందో ? లేదో? చూడాలి. మరోవైపు అలేఖ్య చిట్టి పికిల్స్ ఆడియోను ఇప్పుడు సినిమా ప్రమోషన్లకు సైతం వాడేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : 

Tollywood: మరీ ఇంత క్యూట్‏గా ఉందేంటీ భయ్యా.. గిబ్లి ఆర్ట్‏కే మతిపోగొట్టేస్తోన్న టాలీవుడ్ హీరోయిన్..

Tollywood: అప్పుడు రజినీకాంత్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు బుల్లితెరపై క్రేజీ హీరోయిన్.. ఫోటోస్ చూస్తే..

Actress Indraja : నటి ఇంద్రజ కూతుర్ని చూశారా.. ? అందంలో తల్లిని మించిపోయింది.. స్టార్ హీరోయిన్స్ సైతం..

Tollywood : చేసిన ఒక్క సినిమా అట్టర్ ప్లాప్.. కట్ చేస్తే.. నెట్టింట గ్లామర్ అరాచకం ఈ వయ్యారి.. ఎవరీ ముద్దుగుమ్మ..