AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Kerala Story: కేరళను కుదిపేస్తోన్న ‘ది కేరళ స్టోరీ’.. చెలరేగిన రాజకీయ దుమారం అసలు.. ఈ సినిమాలో ఏముంది?

కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడి చేశారన్న నేపథ్యంలో సాగింది ఈ సినిమా కథనం. కొంత మంది యువతులు అకస్మాత్తుగా కన్పించకుండాపోతారు. వారిని మతం మారేలా చేయడమేకాక బ్రెయిన్ వాష్ చేసి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా మార్చుతారన్నది కథ నేపథ్యం.

The Kerala Story: కేరళను కుదిపేస్తోన్న ‘ది కేరళ స్టోరీ’.. చెలరేగిన రాజకీయ దుమారం అసలు.. ఈ సినిమాలో ఏముంది?
క ముగ్గురు యువతులను మతం మార్చి ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్థ కోసం పని చేసేందుకు ఎలా దేశాలు దాటించారు అనే కథ ఆధారంగా చేసుకుని సుదీప్తో సేన్ ఈ సినిమాను తెరకెక్కించారు.
Surya Kala
|

Updated on: Apr 28, 2023 | 6:59 AM

Share

ది కేరళ స్టోరీ’ సినిమాపై వివాదం ముదురుతోంది. మూవీ ట్రైలర్ మరింత కాంట్రవర్సీకి దారితీసింది. సినిమాపై రాజకీయం దుమారం సైతం చెలరేగింది. ‘ది కేరళ స్టోరీ’ మరో ‘ది కశ్మీర్ ఫైల్స్’ కానుందా..? జనాల్లో ఉత్కంఠ రేపుతున్న ఈ మూవీలో అసలేముంది..? ది కేరళ స్టోరీ.. ఇప్పుడీ మూవీ పెద్ద వివాదంలో చిక్కుకుంది. ద కేరళ స్టోరీ సినిమా రియల్ స్టోరీ ఆధారంగా నిర్మించిన చిత్రం అంటున్నారు. కేరళలో యువతులను బలవంతంగా మతమార్పిడి చేశారన్న నేపథ్యంలో సాగింది ఈ సినిమా కథనం. కొంత మంది యువతులు అకస్మాత్తుగా కన్పించకుండాపోతారు. వారిని మతం మారేలా చేయడమేకాక బ్రెయిన్ వాష్ చేసి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులుగా మార్చుతారన్నది కథ నేపథ్యం. ఈ సినిమాలో హిజాబ్ ప్రస్తావన సైతం ఉంది. హిజాబ్ ధరిస్తే ఏ మహిళ రేప్‌కు గురికాదు… అల్లా అందరిని రక్షిస్తాడని హిందూ యువతితో ఓ ముస్లిం యువతి చెబుతుంది.

కేరళలో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయా అన్న అంశాన్ని సైతం పరిశీలించాల్సి ఉంది. 2022 జనవరిలో కేరళలో ఐఎస్ స్లీపర్ సెల్స్ క్రియాశీలంగా ఉన్నాయని ఎన్ఐఏ వెల్లడించింది. 8 మంది ఉగ్రవాదులకు వ్యతిరేకంగా చార్జిషీట్ ఫైల్ చేసింది. కేరళలోని ముస్లిం యువతీయువకులను ఉగ్రవాదంపైపు మళ్లించే ప్రయత్నాలు జరిగాయని వెల్లడించింది. ఇందులో మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పింది. మరోవైపు ఉమ్మెన్ చాందీ సీఎంగా ఉన్న కాలంలో మతపరివర్తన గణాంకాలను వెల్లడించారు. 2006-2012లో 7713 ప్రజలు ఇస్లాం స్వీకరించారన్నారు. 2009-2012 మధ్య మతం మార్పిడికి గురైనవారిలో 2667మంది యువతులున్నారు. వీరిలో 2195మంది యువతులు హిందువులు కాగా 492 మంది యువతులు క్రిస్టియన్లు ఉన్నారు. దీంతో ద కేరళ స్టోరీ సినిమాపై రాజకీయంగా కూడా దుమారం రేగుతోంది. రాజకీయాల కోసమే ఈ సినిమా నిర్మించారని శివసేన ఎంపీ అరవింద్ సామంత్ అన్నారు.

ఈ సినిమాను బహిష్కరించాలని ఆలిండియా ముస్లింజమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వీ బరేల్వి డిమాండ్ చేశారు. కేరళలో ఉగ్రవాదులు ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతుంటే కేరళ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు బీజేపీ ఐటీవిభాగం ప్రముఖుడు అమిత్ మాలవియా

ఇవి కూడా చదవండి

మొత్తంగా ఈ సినిమా.. టీజర్‌ విడుదలతోనే కష్టాల్లో పడింది. మరి వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న ‘ది కేరళ స్టోరీ’ విడుదల అవుతుందో లేదో చూడాలి!

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..